భక్తి టీవీ..దక్షిణ భారత దేశంలోనే తొలి తెలుగు ఆధ్యాత్మిక ఛానెల్. అన్ని మతాల సమాదరణే ఏకైక లక్ష్యంగా సాగుతున్న భక్తి వాహిని ఇది. ఇప్పటికే టీఆర్పీ రేటింగ్స్ లో అగ్రగామిగా కొనసాగుతున్న ఎన్టీవీ అనుబంధ ఛానెల్ ఇది. ఎన్టీవీ ఆవిర్భవించిన రోజునే...అంటే ఆగస్టు 30, 2007నే భక్తి టీవీ కూడా అధికారికంగా ప్రసారాలను ప్రారంభించింది. అప్పటి నుంచి అప్రతిహతంగా భక్తకోటి ఆశీర్వాదాలతో ముందుకుసాగుతోంది. ఏటా కార్తీకమాసంలో కోటి దీపోత్సవాన్ని భక్తి టీవీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. తెలుగునేలపై కొలువుదీరిన శక్తిపీఠాలు, పంచారామాలే కాదు, అన్ని దివ్యక్షేత్రాల , ప్రముఖ తీర్ధాల దేవుళ్లను భక్తకోటి నేరుగా దర్శించే సదవకాశాన్ని కల్పిస్తోంది భక్తి టీవీ. ఈ కార్యక్రమంలో పాల్గొనే పీఠాధిపతులు, ప్రవచనకారులు,పండితుల అభిభాషణలు అమూల్యాలు, అనిర్వచనీయాలు. టెలివిజన్ ద్వారా మాత్రమే కాకుండా భక్తి మాస పత్రిక ద్వారా కూడా ఆధ్యాత్మిక సౌరభాలను నలుచెరగులా గుబాళింపచేస్తోంది ఎన్టీవీ యాజమాన్యం. ధార్మిక రచనలతో వెలలేని ఆధ్యాత్మికతను అందజేస్తోంది భక్తి పత్రిక.