సువర్ణం ఆవిర్భవించిన రోజు అక్షయ తృతీయ. బంగారం విష్ణుస్వరూపమని మన పురాణాలు పేర్కొన్నాయి. అక్షయ తృతీయ నాడు (మే 14) మేలిమి బంగారంతో శ్రీమహాలక్ష్మిని పూజిస్తారు. పొదుపుకి, మదుపుకి కూడా ఇదో మంచి అలవాటుగా మనవారు పాటిస్తున్నారు. అక్షయ తృతీయ నాడే సింహాచలం అప్పన్నస్వామి నిజరూప దర్శనం లభిస్తుంది. నిరంతరం చందనపు పూతలో దర్శనమిచ్చే ఆ స్వామిని దర్శించుకోగలిగే శుభతరుణమిది. బదరీ నారాయణుడు, కేదారనాథుడు తమ దర్శనాలను అనుగ్రహించే తరుణమిది. కాయకమే కైలాసమన్న బసవేశ్వరుని జయంతి కూడా ఆనాడే. మాధవమాసమని పేరున్న ఈ వైశాఖమాసంలో వైష్ణవ క్షేత్రాలన్నీ బ్రహ్మోత్సవాలతోనూ, ఇతర ఉత్సవాలతోనూ కళకళలాడుతుంటాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం 22వ తేదీన జరగనుంది. నృసింహ జయంతి సందర్భంగా ఈ నెల 25న ఆ స్వామి ఆలయాలన్నింటా ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. మరోసారి కరోనా మహమ్మారి మనదేశంపై విరుచుకు పడింది. వేలాది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఎటుచూసినా భయం... భీతి. ఆలయాలు మూతపడుతున్నాయి. ఉత్సవాలు రద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలను, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి. ఆలయాలను దర్శించడం కంటే ఆ భగవంతుని మానసికంగా పూజించడం ఈ సందర్భంలో ఎంతో మేలు. ఇంటినుండే ఇష్టదైవాలను కొలుద్దాము. కరోనామహమ్మారి నుంచి సకల మానవాళికి విముక్తి ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుందాం. 

➠ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ జగమెరిగిన గురువు. యోగసూత్రాలను, జీవనకళను బోధిస్తూ నిరంతరం శిష్యులను చైతన్య పరుస్తుంటారు. అంతేకాకుండా శాంతి సామరస్యాల కోసం, దేశాలమధ్య మైత్రికోసం విస్తృతంగా పాటుపడుతుంటారు. ఆయన ఆధ్వర్యంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ దేశవిదేశాల్లో ఎన్నో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మే 13 శ్రీశ్రీ రవిశంకర్ జన్మదినోత్సవం.

➠ వాసవీ కన్యకా పరమేశ్వరి కారణ జన్మురాలు. శక్తి స్వరూపిణి. ఆమెను ఆర్యమహాదేవి అంశగా కొలుస్తారు. విశ్వసించిన వారికి మోక్షాన్నిచ్చిన అపర పార్వతిగా సంభావిస్తారు. కన్యక జన్మించిన పెనుగొండలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నేడు వాసవీ మందిరాలున్నాయి. కరోనా నేపధ్యంలో ఈసారి వాసవీ జయంతి నిర్వహణలో పరిమితులుంటాయి.

➠ మూడుకాలాల్లో, మూడు సత్యాల్లో భక్తి కలిగి ఉండాలి. మానవుల్ని తరింపచేసే మార్గం అదొక్కటే. ఇటువంటి శ్రద్ధ కలిగినవాడే భగవానుని పొందగలడు అని నారద మహర్షి తెలియచేశారు. 84 సూత్రవాక్యాలతో నారదుడు రచించిన భక్తిసూత్రాలు జాతికి శిరోధార్యమైన గ్రంథం. నారదజయంతి సందర్భంగా నారదభక్తిసూత్రాల వివరణ....

➠ అన్నవరం క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంగా అలరారుతుంది. మే 22వ తేదీన శ్రీ సత్యదేవుడు, అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవాలు దేవస్థానంలో నిర్వహిస్తారు. దీనినే వార్షిక కల్యాణం అంటారు. పాంచరాత్రాగమ పద్ధతిలో వారంరోజులపాటు జరిగే ఈ కల్యాణోత్సవాలను తిలకించడానికి రెండుకన్నులూ చాలవు. కరోనా నేపథ్యంలో కల్యాణోత్సవాల నిర్వహణలో కొన్ని పరిమితులుంటాయి. 

➠ అద్వైతాన్ని ఒక జీవనవిధానంగా అలవాటు చేసేందుకు గానూ దేశానికి నాలుగువైపులా నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. కంచిలో మూలామ్నాయ శంకరపీఠాన్ని నెలకొల్పారు. కంచిపీఠ సంప్రదాయం ప్రకారం ఆదిశంకరులు... రెండువేల అయిదువందల ఏళ్లుగా మన జ్ఞానాన్ని పాలిస్తున్న జగద్గురువు. శంకర జయంతి సందర్భంగా ఆదిశంకరుల చరిత్ర, వేదాంత ధోరణి గురించి కంచిపరమాచార్య మాటల్లో...

➠ వైశాఖ శుద్ధ  తదియను అక్షయ తృతీయగా పిలుస్తారు. క్షయం అంటే నాశనం. అది లేకపోవడమే అక్షయం. నాశం లేకపోవడమే కాకుండా అత్యధిక అభివృద్ధి లేక ఆధిక్యం పొందించే పవిత్ర తిథి అక్షయ తృతీయ. లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీపూజ నిర్వహించడం, ఉన్నదాంట్లో ఇతరులకు దానం చేయడం అక్షయ తృతీయ నాడు పాటించవలసిన ముఖ్యవిధులు.