Bhakthi Patrika Jan 2017

Availability : In Stock

అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే
అసమానబలాయ ఆర్తరక్ష కాయ నమోనమః
కొత్త ధాన్యాలతో, ఆడపడుచుల రాకతో లోగిళ్లు కళకళలాడే తరుణం వచ్చేసింది... జనపద కళాకారుల పల్లెల్లో సంది చేయనున్నారు... ఆ సూర్యదేవుడు జనవరి 14న మకరాశిలో ప్రశేశిస్తూ మూడురోజుల సంక్రాంతి పండుగను తీసుకువస్తున్నాడు... బోగిపళ్ల పేరంటాలు, బొమ్మల కొలువుల వేడుకలు, ముత్తెదవలకు వాయనాలు... ఇలా పండుగ కోలాహలంగా సాగనుంది. మరోవైపు స్వామియే శరణమయ్యప్పా అనే శరణు ఘోషలు దేశమంతా ప్రతిధ్వనించే సమయమిది...

ఈ ఏడాది ఆరంభంలో 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దివ్యపర్వం రావడం ఈ మాసపు విశిష్టత కాగా.... 12న వివేకానందుడి జన్మదినం, 22వ తేదీన త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం, 31న రామదాసు జయంతిని భక్తిపూర్వకంగా గుర్తు చేసుకుంటున్నాం...
₨ 51.00
Not Rated Yet