భక్తి పత్రిక జూన్ 2017

Availability : In Stock

"గాయత్రీం కమలాసనాం సర్వప్రారబ్ధనాశినీం
సంసారదుఃఖశమనీం హింసాధిరూడాం భజే!"

మూలమంత్రాలకు అధిష్టాన దేవతగా కొలవబడే శ్రీ గాయత్రీమాత జయంతి ఈ మాసపు దివ్య వైభవం... శ్రీగాయత్రీమాత జయంతి జూన్ 5న జరగనుంది. ఇక యుగాలుగా ఏరువాక పండగ సదాచారంగా సంక్రమించింది... శ్రమశక్తిని, ప్రకృతిని ఆరాధించే సంప్రదాయంగా కొనసాగుతోంది... శ్రమజీవుల ఆశలకు అంకురార్పణ జరిగే ఆనంద పర్వదినం ఏరువాక పూర్ణమ జూన్ 9వ వస్తోంది... వరుణ దేవుడి అనుగ్రహంతో రైతుల కష్టాలు ఫలించాలని కోరుకుందాం...

జూన్ 25న దేశమంతా ఉత్సాహంగా జరుపుకునే జగన్నాథుని రథయాత్ర మహోత్సవానికి భక్తితో మొక్కుదాం... తెలంగాణ ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే దివ్యమైన పండుగ బోనాలు... గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించుకునే బోనాల పర్వం జూన్ 25న ప్రారంభం కానుంది. ప్రపంచానికి భారతావని అందించిన గొప్ప కానుక యోగ విద్య... మానసిక, శారీరక ఆరోగ్యాలకు దివ్యసంజీవని యోగ... యాంత్రికయుగంలో యావత్ర్పపంచం యోగసాధనని దినచర్యలో భాగంగా చేసుకుని సుఖిస్తోంది... జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసన పద్ధతులను చిరు పుస్తకంగా మీకందిస్తున్నాం.
₨ 51.00
Not Rated Yet