భక్తి పత్రిక జులై 2017

Availability : In Stock

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మెశ్రీ గురవేనమః అంటూ శిరసు వంచుతాం... ధ్యాన, పూజ, మంత్ర, మోక్షాలన్నింటికీ మూలం గురువే... జులై 9న గురుపూర్ణిమ మహోత్సవం రానుంది... మనం నాగరికంగా, మానవతా విలువలతో ఉన్నతంగా జీవించడానికి కారణమైన గురువులకు వినమ్రంగా గురువందనం చేసుకుందాం. ఈ నిండు పూర్ణిమవేళ పీఠాధిపతులు, స్వాములు చాతుర్మాస్య దీక్షకు ఉపక్రమిస్తారు.

జూన్‌లో ఆరంభమైన బోనాల పర్వం ఈ మాసంలో మహోధృతంగా సాగుతుంది... బైలెల్లిన తల్లి అందరినీ చల్లంగా చూడాలని కోరుకుందాం... తెలుగింటి ఆడపడుచులు, పెద్ద ముత్తయిదువలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే మంగళగౌరీ వ్రతం ఈ నె 25న రానుంది. ఇక జులై 24 నుంచి ఆగస్టు 21 వరకు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నోములు తాంబూలాలతో, శనగల వాయనాలతో చిత్తడి చినుకుల మధ్య తెలుగు లోగిళ్లకు వినూత్న శోభ తేనున్నాయి.
₨ 51.00
Not Rated Yet