భక్తి పత్రిక అక్టోబర్ 2017

Availability : In Stock

చీకటిని పారద్రోలి భువనమంతా వెలుగులు విరజిమ్మే దీపావళి ఈ నెల 19న వేడుక చేయనుంది... ఈ దివ్య దీపావళి అందరికీ శాంతిని, కాంతిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాం. తూర్పు దిక్కుకు పెద్ద పండుగైన సిరిమానోత్సవం ఈ నెల 3వ తేదీన ఘనంగా జరగనుంది... పైడితల్లి అందరినీ చల్లగా చూడాలని వేడుకుందాం. తెలుగు పల్లెలు ఆడపడచుల రాకతో కళకళలాడే అట్లతద్ది ఈ నెల 8న సందడి చేయనుంది.

పవిత్ర కార్తీకం ఈ నెల 20న ఆకాశ దీపాలతో అడుగుపెడుతోంది... విబూది రేఖలు, మారేడుదళాలు, మహాదేవుని నామస్మరణలు, కార్తీక ఉపవాసదీక్షలతో ఈ మాసం దివ్యప్రభలతో సాగుతుంది. కార్తీకంలో మూడు పొద్దులూ పవిత్రం, మూడు ఆకుల మారేడుదళం సాక్ష్యం, శివనామం పవిత్రం, కార్తీకంలో దీపం పుణ్యప్రదం... ఉపవాసం మోక్షప్రదం... శివనామం కైవలస్యకారకం... ముక్తికి సోపానం. కార్తికం భక్తి టీవీకి ప్రత్యేకం, మణిపూస... యేటేటా జరిపే కోటి దీపోత్సవాన్ని ఈ పొద్దు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్వహించ సంకల్పించింది... మహనీయులు, మఠాధిపతులు, మాతాజీలు విచ్చేసి దీపోత్సవానికి దివ్యత చేకూర్చనున్నారు. ఈ దీపయజ్ఞంలో విరివిగా పాల్గొని సదాశివుని సేవించుకోవాలని కోరుకుంటున్నాం...
₨ 51.00
Not Rated Yet