భక్తి పత్రిక మార్చి 2018

Availability : In Stock

చాంద్రమానం అనుసరించే మనందరికీ సంవత్సరాది ఉగాది. మార్చి 18న కోయిల పాటలతో... షడ్రుచుల ప్రసాదంతో... పంచాంగ శుభశ్రవణంతో వచ్చేస్తుంది యుగాది. శ్రీవిళంబినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ శుభలాభాలు కలగాలని శుభాకాంక్షలు తెలుపుదాం. వసంతానికి ముందే పాళ్గుణ పూర్ణమ మార్చి1 రంగురంగుల హోలీ సంబరాన్ని తీసుకొస్తుంది. అలాగే శృంగారిమహాస్వామి జయంత్యుత్సవం ఈనెల 23న వస్తుంది. వారి జన్మోత్సవం జాతికి దినోత్సవం మంగళప్రదం కాగలదని ఆకాంక్షిస్తున్నాం.

అలాగే శ్రీసీతారామ కళ్యాణం తెలుగువారి మహోత్సవం, పచ్చని తాటాకు పందిళ్లు, వడపప్పు ప్రసాదాలు, చెరకు పానకాలు రామనవమి ఆనవాళ్లు. అటు భద్రాచలం, ఇటు ఒంటిమిట్ట 30న అంటు పగలు, ఇటు రాత్రి భక్తి శ్రద్ధలతో, మేళతాళాలతో, పెళ్లి వ్యాఖ్యానాలతో నూతన వధూవరులుగా సీతారాములు శిరస్సున ధరించిన ముత్యాల తలంబ్రాలు కమనీయ శోభతో వెలిగిపోతాయి.
₨ 51.00
Not Rated Yet