భక్తి పత్రిక సెప్టెంబర్ 2018

Availability : In Stock

ఆది దేవుడు, విజయాన్నిచ్చే విఘ్నదేవుణ్ని ఆరాధించుకొనే వినాయక చవితి ఈనెల 13న విచ్చేస్తోంది. తొమ్మిది రోజుల పాటు పల్లెల నుంచి పట్టణాల వరకు ఆధ్యాత్మిక శోభ తోరణాలు కడుతుంది. ఇక్కడ నుంచే పండుగలు మొదలౌతాయి. పత్రి, పూలతో శ్రద్ధాభక్తులతో జరుపుకొనే పండుగ ఇది. ఈ మాసారంభంలోనే కృష్ణాష్టమి విజయం చేస్తోంది. దేశమంతా కృష్ణస్వామి స్మరణతో, కోలాటాలతో, ఉట్టికొట్టే ఆటలతో కోలాహలంగా ఉంటుంది. ఈ నెల 13న తిరుమలలో అధికమాస బ్రహ్మోత్సవాలు ఆరంభమౌతున్నాయి. శ్రీనివాసుడు తిరుమాడ వీథుల్లో ఊరేగుతూ... భక్తులను అనుగ్రహిస్తాడు. సప్తగిరులు పులకించిపోతాయి.

మంచి పని సంకల్పించడంలోనే దైవత్వం ఉంది. దానికి చిత్తశుద్ధి తోడైనప్పుడు దైవం కూడా ఉండి నడిపిస్తాడు. అప్పుడు ఎంతటి బృహత్కార్యమైనా అవలీలగా సాగిపోతుంది. సత్సంకల్పానికి మించిన పూజ ఏదీ లేదు అన్న మహాగురువుల సందేశాన్ని తలచుకొని సత్సంకల్పాలకు నాంది పలుకుదాం. గతించిన పెద్దలను పేరుపేరునా స్మరించుకుంటూ వారి సౌఖ్యం కోసం దానధర్మాలు చేసే మహాలయ పక్షాలు 25నుంచి ప్రారంభమౌతాయి. వారిని తరింపజేద్దాం.
₨ 51.00
Not Rated Yet