భక్తి పత్రిక అక్టోబర్ 2018

Availability : In Stock

దేశమంతా ఎంతో భక్తితో జరుపుకొనే దేవీ నవరాత్రులు ఈ నెల ప్రత్యేక శోభను తెస్తున్నాయి. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఆ శక్తి స్వరూపిణిని భక్తజనం నవరూపాల్లో ఆరాధించి తరిస్తుంటారు. బొమ్మల కొలువులు, పూజలు, వ్రతాలు, ఉత్సవాలు వ్రతాలతో పరవశత్వాన్ని పొందుతారు. తెలంగాణ ఆడపడుచులు పచ్చపూల బతుకమ్మని తెప్పమ్మని చేసి కొలుస్తారు. జానపదాలు తంగేడులై, తురాయిపూలై, పసుపు కుంకుమలై ప్రతిఫలిస్తాయి. సద్దుల బతుకమ్మ వాల్లాడింపుతో దుర్గాష్టమినాడు ఈ కోలాహలం ముగుస్తుంది.

ఈ నెలలోనే మహాలయ అమావాస్య వచ్చింది. గతించిన పెద్దలందరినీ నియమ నిష్టలతో తలచుకుంటూ వారికిచ్చే సంబారాలను దానధర్మాల రూపంతో సమర్పిస్తారు. విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఈ నెల 23న రానుంది. ద్వారకాతిరుమల కల్యాణోత్సవం కూడా అదేరోజు వచ్చింది. ఇంకా శ్రీ మద్వాచార్య దివ్య ప్రబోధాలను స్మరించుకొనేందుకు వారి జయంతి కూడా అక్టోబర్ 18న వస్తోంది. అంతేకాకుండా శ్రీశిరిడి సాయి సమాధి ఉత్సవం కూడా ఇదే రోజు.
₨ 51.00
Not Rated Yet