భక్తి పత్రిక డిసెంబర్ 2018

Availability : In Stock

భక్తిటివి కోటి దీపోత్సవం దిగ్విజయంగా పూర్తయింది. ప్రతిరోజూ లక్షలాది ప్రజలు దీపాలు వెలుగిస్తూ..ఉభయ తెలుగు రాష్ట్రాలను దీపజ్యోతిగా ప్రకాశింపజేశారు. ఈ దీపయజ్ఞం మున్ముందు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మా సంకల్పానికి తోడ్పాటు అందించిన వారికి.. ఉత్సవాన్ని జయప్రదం చేసిన అశేష భక్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్

పద్దెనిమిది అధ్యాయాల భగవగ్దీత హిందువులకు ఎంతో ఆచరణీయమైంది. మానవాళికి గీత సంప్రాప్తించిన శుభఘడియ గీతాజయంతి. ఈ నెల 18వ ఈ గొప్ప పర్వదినాన్ని జరుపుకుంటూ గీతావాక్కులను స్మరించుకుందాం. అదే రోజు వైకుంఠ ఏకాదశి కావడం మరో విశేషంగా చెప్పవచ్చు. డిసెంబర్ 16న ధనుర్మాసం ముగ్గులతో మన గుమ్మాలలో అడుగుపెడుతుంది. అలాగే ఆంజనేయ భక్తులు జరుపుకొనే హనుమద్ర్వతం ఈనెల 20న భక్తులు జరుపుకోనున్నారు. ఇంకా శ్రీ పద్మావతీదేవీ బ్రహ్మోత్సవాలు ఈనెల 3 అంకురార్పణ చేసుకొని తిరుచానూరిని ఉత్సవశోభతో అలరించనున్నాయి.
₨ 51.00
Not Rated Yet