భక్తి పత్రిక ఫిబ్రవరి 2019

Availability : In Stock

ఏ మహానుభావుని రాకతో నిత్యం మనకు పొద్దు పొడుస్తుందో.. చెట్లు చిగురిస్తాయో... పూలు రెక్కలు విప్పుతాయో ఆ సూర్య దేవునికి నమస్కారం. విశ్వమంతా కాంతులు పొంగుతాయి. ప్రతి సూర్యోదయం ఒక నూతన సృష్టి. చైతన్య స్రవంతి. ప్రత్యక్ష నారాయణుడు అయిన ఆదిత్యుడు ఈ మాసంలో అంటే 12న వస్తున్న రథసప్తమి సూర్యారాధన పర్వదినం. మన దక్షిణాదిన భక్తకవులు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వారి సేవ అజరామరం. ఈ నెల 4,5 తేదీలలో భక్త పురందరదాసు జయంతి, భక్త రామదాసు జయంతి ఉన్నాయి.

అలాగే పలుకులమ్మని కొలుచుకొనే వసంతపంచమి ఈనెల 10వ తేదీన వస్తున్నాయి. ఇంకా వాసవీకన్యక ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని నిలుపుకోవడానికి రాజరికాన్ని ధిక్కరించిన ధీరవనిత. అందుకే ఆమెను దైవాంశ సంభూతురాలుగా ఆలయాల్లో పూజిస్తారు. ఫిబ్రవరి 6న ఆమెను భక్తిపూర్వకంగా స్మరించుకుంటాం. కంచికామకోటి పూర్వపీఠాధిపతి శ్రీజయేంద్రసరస్వతి తొలి ఆరాధనోత్సవం ఈనెల 18వ తేదీన వస్తుంది. అలాగే... ఫిబ్రవరి నెలాఖరులో శ్రీశైలం, శ్రీకాళహస్తీశ్వర సహా ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమౌతున్నాయి.
₨ 51.00
Not Rated Yet