భక్తి పత్రిక సెప్టెంబర్ 2019

Availability : In Stock

"శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"

సెప్టెంబర్ నెల వస్తూనే వినాయక చతుర్ధిని వెంట తీసుకు వస్తోంది. ఈ నెల 2 నుంచి గణపయ్య నవరాత్రి ఉత్సవాలు పల్లెల్ని పట్టణాలను సందడిలో ముంచెత్తుతాయి. భక్తి ప్రపత్తులతో ప్రతి వినాయక విగ్రహానికీ పూజలు జరుగుతాయి. బొజ్జ గణపయ్యకి బోలెడు నివేదనలు సమర్పిస్తారు. భక్తులు ఆరగించి ఆనందిస్తారు. విఘ్నేశ్వరుడు విలక్షణమైన దేవుడు. మనం తలపెట్టే అన్ని కార్యక్రమాలనూ ముందుండి నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తాడు. అందుకే ఆయన ఆదిదేవుడు. విఘ్నరాజుని స్మరించకుండా ఎవ్వరూ అడుగు ముందుకు వేయరు. మన పండుగలు కూడా వినాయక చతుర్ధితోనే వరస పెడతాయి. చవితి పండగ, తర్వాత నవరాత్రి పర్వం, అనంతరం శోభాయాత్రతో వినాయక నిమజ్జనం వాడవాడలకీ ఆధ్యాత్మిక శోభని అద్దుతాయి.

గణనాథుడు జానపదుల దేవుడు. తలపెట్టిన పనులన్నిటినీ ముందుండి విజయవంతంగా నడిపిస్తాడని గణపయ్య మీద తిరుగులేని నమ్మకం. చవితి పూజలు అందుకోవడానికి వినాయకుడు భూమ్మీదకు రావడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఆయన జనసామాన్యుల దేవుడు. వినాయకుని స్వరూపం విలక్షణమైనది. ఆయన లంబోదరుడు, మరుగుజ్జు అయినా ప్రతికూలతలను అధిగమించి ఆదర్శం అయ్యాడు. కార్యసాధకులకు అవసరమైన లక్షణాలన్నీ గణేశునిలో మూర్తీభవించాయి. గణేశుని ఆకృతిలో ఒక్కో భాగమూ ఒక్కో సందేశాన్ని మనకు అందిస్తుంది.
₨ 51.00
Not Rated Yet