Email

Bhakthi Patrika June16

Availability : In Stock

ప్రపంచమంతా జూన్ 21న యోగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఆ సందర్భంగా ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాస సౌరభాలు ఆశ్వాదించాల్సిందే.

జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పూర్ణిమ. ఈ ఏరువాక అన్నదాతల ఆశల స్వప్నాలను నిజం చేయాలని ఆకాంక్షిస్తున్నాం.

అంతేకాదు ఈనెలలో వచ్చే స్వామి నారాయణ పుణ్యతిథి, సద్గురు శివానందమూర్తి పుణ్యతిథి వేళ..ఆ మహనీయుల తత్త్వాన్ని మననం చేసుకుందాం.

హనుమత్కల్యాణోత్సవం, వింధ్యవాసినీ పూజ, వటసావిత్రీ వ్రతం భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.

ఈ వర్ష రుతువులో వానలు ప్రసాదించి దేశంపై ఆకుపచ్చని సంతకం చేయాలని ప్రకృతి మాతను మనసారా ప్రార్ధిద్దాం..


ఇక ఎందుకు ఆలస్యం... ఈ నెల 'భక్తి' పత్రికను పొందేందుకు క్లిక్‌ చేయండి...
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

-ఏకాగ్రతను పెంచడమేకాదు దైవీ భావనకు దగ్గరచేసివి ధ్యానయోగ సూత్రాలంటారు. అసలు ధ్యానమంటే ఏమిటి? పతంజలి ధ్యానసూత్రాలు ఏం చెబుతున్నాయి? ఇలాంటి వివరాలను 'ధ్యానం ముక్తి మార్గం' లో చూడొచ్చు.

-అసలు ఆసనాల ప్రాముఖ్యం ఏంటి? యోగాలు ఎన్ని విధాలు? ఆసనాలు వేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో వివరిస్తుంది' ఆరోగ్య యోగం' వ్యాసం.

-'అరిష్టదాత కాదు.. సర్వానుగ్రహ ప్రదాత' వ్యాసం శని అంటే భయపడాల్సిన పనిలేదని, పైగా మోక్షకారకుడని వివరిస్తుంది. అంతేకాదు శనిబాధలు తొలగించుకోడానికి సులువైన పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. జూన్ 5న వచ్చే శనిజయంతిని పురస్కరించుకుని ఈ ప్రత్యేక వ్యాసం మీకు అందిస్తున్నాం.

- పూరీ జగన్నాథుని స్నానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామివారు ఏడాదికి ఒక్కమారు మాత్రమే ఎందుకు స్నానం చేస్తారు? ఆయనకు ఎందుకు జ్వరం వచ్చింది? మహావిష్ణువు భోజన ప్రియుడు కూడానా? లాంటి సందేహాలకు ' జై..జై.. జగన్నాథ'లో పూర్తి వివరణలు ఉన్నాయి.

-శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదినం, జిల్లెళ్లమూడి అమ్మ పుణ్యతిథి, సద్గురు శివానందమూర్తి పుణ్యతిథి, కబీర్ దాస్ జయంతి పురస్కరించుకుని ప్రత్యేక వ్యాసాలున్నాయి.  

-భారతీయ సాంస్కృతిక చరిత్రలో యోగ విద్యకు ఎనలేని ప్రాముఖ్యముంది. దానికి విశేష స్థానం కల్పించిన మహనీయుడు పతంజలి. ప్రస్తుతం యోగ విద్యకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం లభిస్తోంది. మరి అలాంటి యోగాసనాలు వేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? కొన్ని ముఖ్యమైన ఆసనాలు వేసే విధానం ఏమిటి? దాని వల్ల కలిగే ఉపయోగాలేంటి? ఇలాంటి వివరాలతో కూడిన 'యోగాసనాలు' అనుబంధం మీకోసం.

Reviews

There are yet no reviews for this product.