Email

Bhakthi Patrika Aug16

Availability : In Stock

ఈ ఆగస్టు నెలలో కృష్ణా పుష్కర సంరంభం ఆరంభమవుతోంది. ఈనెల 12 నుంచి 12 రోజులపాటు సాగే పవిత్ర పుష్కర వేళ పెద్దలకు తర్పణలు అర్పించడం, దానధర్మాలు చేయడం పుణ్యప్రదంగా భావించడం సర్వసాధారణం.

ఈ శ్రావణంలోనే వరలక్ష్మీ వ్రతం వస్తోంది. మహిళాలోకం భక్తిశ్రద్ధలతో ఆచరించే ఈ పుణ్యవ్రతం వారికి చల్లని దీవెనలు అందించాలని మనసారా ప్రార్ధిస్తున్నాం.

ఇక..అన్నాచెల్లెళ్ల ఆత్మీయతలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పురస్కరించుకుని తోబుట్టువులకు ఇవే శుభాకాంక్షలు.

ఇదే నెల 24, 25 తేదీల్లో వచ్చే కృష్ణాష్టమి వేడుకల వేళ ..యదుకులస్వామి అందర్నీ అనుగ్రహించాలని మనసారా వేడుకుంటున్నాం.


ఇక ఎందుకు ఆలస్యం... ఈ నెల 'భక్తి' పత్రికను పొందేందుకు క్లిక్‌ చేయండి...
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

-కృష్ణా నది ఎన్నో ప్రాంతాల గుండా ప్రవహించింది. ఎంతోమంది తెలుగు కవుల నీరాజనాలు అందుకొంది. ఈ నదీతీరప్రాంతంలో ఎన్నో రాజవంశాలు పాలనలను సాగించాయి. మరెన్నో పుణ్య తీర్ధాలు వెలిశాయి. వీటన్నింటినీ తలచుకుంటూ సాగే స్వగతం 'నా పేరు కృష్ణవేణి' .

-పుష్కర గాథ, కృష్ణా  పుట్టుక-వికాసం, మహారాష్ట్రలో ఆవిర్భవించి'నది' మొదలుగా తెలుగు నేలపై నడయాడిన దివ్యశోభను 'కృష్ణవేణీ పుష్కర మహాత్మ్యం'  వివరిస్తుంది.

-ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ రాసిన 'కృష్ణాం వందే జీవనాధారం' ప్రత్యేక వ్యాసం 'కృష్ణఒడ్డు జాతి' ప్రాశస్త్యాన్ని మన కళ్లముందు ఉంచుతుంది.

-ఆంధ్ర మహాభారతం మొదలు కొని ఆధునిక కావ్యాల వరకూ తమ రచనల్లో వివిధ కవులు కృష్ణవేణిని కొనియాడిన విధానం 'కవుల వాణిలో కృష్ణవేణి'లో చూడొచ్చు.

-కృష్ణానదీతీరంలో ఎందరో సిద్ధలు, యోగులు, రుషులు జన్మించారు. నివసించారు. వారంతా ఈ జాతిని తరింపచేశారు. వాటి వివరాల సమాహారమే 'కృష్ణాతీరంలో యోగులు' .

-కృష్ణాతీరాన గల ఆలయాలు, తెలంగాణ ఒడిలో  ఆ నది పరవళ్లు, ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక సీమల్లో నది ఒడ్డున వెలసిన ముక్తిధామాలు, తెలుగు సినిమా పాటల్లో కృష్ణానది ప్రస్తావనలకు సంబంధించిన వ్యాసాలు ఎన్నో ఈ సంచికలో ఉన్నాయి.

-ఈ సంచికతోపాటు కృష్ణా పుష్కర కరదీపిక, శ్రీవరలక్ష్మీ వ్రతకల్పం ప్రత్యేక అనుబంధాలు ఉచితం.

Reviews

There are yet no reviews for this product.