Email

Bhakthi Patrika Nov16

Availability : In Stock

''లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం''
అనే శరణుఘోషతో ఈ కార్తిక మాసం తెలుగునేల మార్మోగిపోతుంది.

అంతేకాదు భక్తి టీవీ నవంబరు 5 నుంచి 21 వరకు అఖండంగా నిర్వహించే 'కోటి దీపోత్సవం' కనురాలా చూడటమంటే భూలోక కైలాసాన్ని దర్శించడమే. భక్తి పత్రిక సంచికతో ఇస్తున్న ప్రత్యేక పాసును కూడా వినియోగించుకోవాలని భక్తజనులకు మనవి.

ఇక ఈ కార్తిక మాసంలో నిర్వహించే వనభోజనాలు సమతావాదానికి ప్రతీకల్లా ఉండాలే తప్ప కులాలు, వర్గాల వారీగా విభజన బీజాలకు వేదికలు కారాదని కోరుతున్నాం..

ఇక ఎందుకు ఆలస్యం... ఈ నెల 'భక్తి' పత్రికను పొందేందుకు క్లిక్‌ చేయండి...
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆధ్యాత్మిక విందు కోటి దీపోత్సవం. దీనికి హాజరుకానున్న జగద్గురువులు, పీఠాధిపతులు, సద్గురువులతోపాటు వివిధ క్షేత్రాల నుంచి తరలివచ్చే ఉత్సవమూర్తులకు జరగబోయే కల్యాణోత్సవాల వివరాల సమాహారం 'కోటిదీపాల కైలాసం"

- ''యాజ్ఞవల్క్యుడు -నిత్యసత్యాన్వేషి'' ప్రత్యేక వ్యాసంలో డాక్టర్ పూర్ణప్రజ్ఞాభారతి ఆయన దృక్పథాన్ని, పథాన్ని, ప్రగతిశీల తత్వాన్ని అనితరసాధ్యంగా ఆవిష్కరించారు. 

-నవంబరు 23న భగవాన్ సత్యసాయి జయంతి సందర్భంగా ప్రచురితమైన 'ప్రేమ స్వరూపం' ప్రత్యేక వ్యాసం  ఆ మహనీయుని దివ్యప్రేమను, సందేశాన్ని, సేవాధర్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేస్తుంది.

- ఈనెల14 గురునానక్ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుడి ఆవిష్కరించిన ధార్మిక పథ వివరణ 'గురుదైవం'లో చూడొచ్చు. అంతేకాదు నానక్ సూక్తులు,వాటి అర్ధాలు కూడా ఇందులో ఉన్నాయి.

- ఈనెల విశిష్ట అనుబంధం- "అయ్యప్ప పూజావిధి". ఇందులో దీక్షలో పాటించాల్సిన నియమాలు, దీక్షకు సంబంధించిన కొన్ని విశిష్ట పదాల వివరణలు, మండల దీక్షలో ఉన్నవారికి ఎదురయ్యే సందేహాలు, సమాధానాలు, పూజా విధి, శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామపూజది ఉన్నాయి. 

- వీటితోపాటు ధర్మ సందేహాలు, మాసఫలం, పుస్తక సమాచారం కూడా ఉన్నాయి. 

Reviews

Wednesday, 30 November 2016 Rating: 5/5
gjhgjhgjhgjhghjgjhg