Email

Bhakthi Patrika Jan 2017

Availability : In Stock

అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే
అసమానబలాయ ఆర్తరక్ష కాయ నమోనమః
కొత్త ధాన్యాలతో, ఆడపడుచుల రాకతో లోగిళ్లు కళకళలాడే తరుణం వచ్చేసింది... జనపద కళాకారుల పల్లెల్లో సంది చేయనున్నారు... ఆ సూర్యదేవుడు జనవరి 14న మకరాశిలో ప్రశేశిస్తూ మూడురోజుల సంక్రాంతి పండుగను తీసుకువస్తున్నాడు... బోగిపళ్ల పేరంటాలు, బొమ్మల కొలువుల వేడుకలు, ముత్తెదవలకు వాయనాలు... ఇలా పండుగ కోలాహలంగా సాగనుంది. మరోవైపు స్వామియే శరణమయ్యప్పా అనే శరణు ఘోషలు దేశమంతా ప్రతిధ్వనించే సమయమిది...

ఈ ఏడాది ఆరంభంలో 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దివ్యపర్వం రావడం ఈ మాసపు విశిష్టత కాగా.... 12న వివేకానందుడి జన్మదినం, 22వ తేదీన త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం, 31న రామదాసు జయంతిని భక్తిపూర్వకంగా గుర్తు చేసుకుంటున్నాం...
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-
-ప్రతి పండగకూ ఒక్కో దేవతను ఆరాధించడం ఆచారం... మరి సంక్రాంతి వచ్చే వారాన్ని బట్టి ఉన్న విశిష్టతలు మన భరద్వాజ మాటల్లో 'సంస్కృతికీ పత్రీక సంక్రాంతి'...
-పండగంటే సంబరం, సంబరాల్లోనే సంస్కృతి వెల్లివిరిస్తుంది... ఆధ్యాత్మిక, ఆరోగ్య, సామాజిక స్పృహసాగే సంక్రాంతి వైభవం మరుగున పడుతోందా అంటూ డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ అందించిన 'ఆనాటి సంక్రాంతి'
-విష్ణు భక్తులకు ప్రత్యేకమైన మక్కోటి ఏకాదశి మహాపర్వదినం గురంచి డాక్టర్‌ కేఎన్‌వీవీఎస్‌ సూర్యనారాయణమూర్తి మాటల్లో 'అనంత పుణ్యప్రదం ముక్కోటి ఏకాదశి'...
-అయ్యప్పస్వామి భక్తులకు ప్రియమైన మరకజ్యోతి దర్శనం గురించి యర్రమిల్లి శరణాదాస్‌ వివరణలో 'కోటికాంతులమయం మకరజ్యోతి దర్శనం'...
-వీటితోపాటు జోగులాంబ బ్ర్మోహత్సవం, భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం, మొక్కులు తీర్చే మల్లన్న వైభవం, నాగోబా జాతర, ఐనవోలు జాతర, అప్పన్న తెప్పోత్సవం, శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవం... ధర్మ సందేహాలు, మాసఫలం, పుస్తక సమాచారం కూడా ఉన్నాయి ఈ సంచికలో...

Reviews

There are yet no reviews for this product.