Email

భక్తి పత్రిక ఫిబ్రవరి 2017

Availability : In Stock

దేవదేవుడు లింగరూపుడై ఆవిర్భవించిన దివ్వ ఘడియలివి... మహిమాన్విత... మహత్తర దినమైన మహాశివరాత్రి (ఫిబ్రవరి 24) కోసం భక్తులు ఏడాది పొడుగునా ఎదురుచూస్తుంటారు... మనసాస్మరిస్తే చాలు సాక్షాత్కరించి కోరిన వరాలిస్తాడని ఆ మహాదేవునికి ప్రతీతి... శివరాత్రి వేళ ఉపవాసాలు, భక్తితో శివనామ స్మరణతో జాగారం చేస్తారు భక్తులు. శివరాత్రి ప్రభలతో సహా స్వామిని సేవించి మొక్కులు తీర్చుకుంటారు.

సమస్త జీవకోటికి దృష్టి, పుష్టి ఆ సూర్య దేవుడు... ఆయనను కొలిచే రథసప్తమి ఈ నెల ఆరంభంలోనే వచ్చింది... పాలపొంగళ్లతో, చిక్కుడు రథాలతో ఆ దేవుణ్ణి సేవించుకుందాం... భీష్మాచార్యుని స్మరించుకుని ఫిబ్రవరి 7న భీష్మఏకాదశి రోజు అంజలి ఘటిద్దాం. అంతర్వేది నృసింహ కల్యాణం, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ కల్యాణం, హంసలదీవి వేణుగోపాలస్వామి కల్యాణం వైభవంగా జరగనున్న వేళ ఆ దేవుళ్లందరినీ ప్రార్ధిద్దాం...
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

-ప్రకృతి పార్వతితో అంతర్గతంగా ఉన్న పురుష పరమేశ్వరుణ్ని దర్శింపజేయడానికి ఒక ప్రతీక అవతరించింది... అదే శివలింగం... 'యోగదాత్రి శివరాత్రి' గురించి డాక్టర్‌ మంజలూరి నరసింహరావు మాటల్లో...

-మాఘం అంటే పాపాలను నశింపచేసే శక్తి కలది... మాఘమాసం సూర్యుని మాసం... ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత వచ్చే రథసప్తమి పవిత్రత... డాక్టర్‌ కుప్పగంతు రామకృష్ణ మాటల్లో 'ఐశ్వర్యప్రదం... ఆరోగ్యపథం... రథసప్తమి'...

-రెండేళ్లకోసారి మేడారం మహాజాతర వస్తుంది... తదుపరి సంవత్సరం చిన్న జాతర జరుగుతుంది... తిరుగు జాతర లేదా మండమెలిగే పండగగా నిర్వహించే సమ్మక్క-సారలమ్మ చినజాతర గురించి డాక్టర్‌ కె.విద్వత్‌ శ్రీనిధి చెప్పిన విశేషాలు 'మేడారం చిన్నజాతర'...

-శివతత్త్వ చింతనమే జ్ఞానయోగం... శివనాస్మరణమే మోక్షమార్గం... గుండెనిండా శివుణ్ణి నింపుకోవడమే ఆనందం... సగం దేహం దేవికి ముందే ఇచ్చేసిన శివుడిలో హృదయం అమ్మవైపు వాటా అంటున్న కర్రా కార్తికేయ శర్మ మాటల్లో 'గుండెనిండా శివుడు'....

-శివభక్తితో పొందిన జ్ఞానం కైవల్య శిఖరాలకు చేర్చుతుంది... శివభక్తుల గాథలను స్మరిస్తే శివతత్వం సులభంగా భోధపడుతుంది... జ్ఞానమోక్షాలతో పాటు ఆయురారోగ్యాలను ప్రసాదించే 'శివ పూజాఫలం'... పీఎస్‌ఆర్‌. ఆంజనేయప్రసాద్‌ వ్యాఖ్యల్లో...

-వీటితోపాటు వేదకాలంలో శివుడు, శివావతారం, మల్లన్న కల్యాణం, అంతర్వేది నృసింహుని కల్యాణం, తెలంగాణలో తొలిదేవర, ఇలపై కైలాసం కాశీపురం, అపురూపం... అద్వితీయం అమరావతి... ధర్మ సందేహాలు, మాసఫలం, పుస్తక సమాచారం కూడా ఉన్నాయి ఈ సంచికలో...

Reviews

There are yet no reviews for this product.