Email

భక్తి పత్రిక మే 2017

Availability : In Stock

నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే
శ్రీరామదూతగా ఘనకీర్తి పొందిన కార్యశూరుడు... రామబంటు అయినా ఆ రామునికి దీటుగా పూజలు అందుకుంటున్న సర్వసద్గుణవంతుడు శ్రీహనుమాన్... భక్తులు ఆనందోత్సహాలతో... భక్తిప్రపత్తులతో జరుపుకునే హనుమజ్జయంతి మే 21వ తేదీన రానుంది. మర్యాద, మాటతీరు ఎరిగిన అతులిత బలశాలి గురించి ఈ సంచికలో వేర్వేరు కోణాల్లో దర్శింపజేశాం... మే6న అన్నవరం సత్యదేవుని కల్యాణ శుభముహూర్తం ఉన్నది... కోరిన వరాలిచ్చే శ్రీసత్యనారాయణస్వామిని ప్రతివరూ స్మరించుకుంటారు... ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా... లేకున్నా... ఆ సత్యదేవుని వ్రతం ఆచరిస్తూ ఆయన కృపకు పాత్రులవుతారు. ఆ దేవుడి కల్యాణవేళ... మే సంచికతో పాటు సత్యనారాయణస్వామి వ్రతవిధానాన్ని చిరుపుస్తకంగా ఉచితంగా అందుకోండి.

ఈ వైశాఖం మహానీయుల జన్మోత్సవ పర్వంగా, నిత్యోత్సవమై భాసిల్లనుంది... మే 1న శ్రీమద్రామానుజుల జయంతి సందర్భంగా వెయ్యేళ్లనాడు అసమానతలపై సమరశంఖం పూరించిన సమతాయోగికి అంజలి ఘటిస్తున్నాం. తన జీవితాన్ని రామభక్తికి ధారపోసిన త్యాగరాజు జయంతి కూడా మే1నే కలిసివచ్చింది. మే 5న సీతాజయంతి, వాసవి కన్యక జయంతి, మే 9న నృసింహ జయంతి, తరిగొండ వెంగబాంబ జయంతి, మే 11న నారద జయంతి, అన్నమయ్య జయంతి, మే 11న జిడ్డు కృష్ణమూర్తి జయంతి, మే 13న ఆధునిక గురుబ్రహ్మలు శ్రీశ్రీ రవిశంకర్, మే 26న శ్రీగణపతి సచ్చిదానందల జన్మదినోత్సవాలు వైశాఖానికి దివ్యత్వం ఆపాదిస్తున్నాయి. మే 10న ప్రపంచమంతా జరుపుకునే బుద్ధ పూర్ణిమ వేళ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

- ఆంజనేయస్వామి పేరు పలికినంతలోనే పసివారి నుంచి పండు ముసలివారి హృదయాలు సైతం ఉత్తేజ పూరితమవుతాయి...

అభద్రతాభావం తొలగిపోయి కొండంత అండ మన చెంతనే ఉందన్న ధైర్యం కలుగుతుంది...

ఎంతటి క్లిష్టమైన కార్యమైనా చిటికెలో సాధించగలమన్న ఆత్మస్థైర్యం కలిగించే కార్యసాధకుడు హనుమంతుడి గురించి

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ చెప్పిన సంగతలు 'పంచముఖ హనుమ'లో...

- హనుమంతునికి సంబంధించిన ప్రతిపర్వం ఖగోళ విశేషాలతో ముడిపడిందే... హనుమజ్జయంతి నాడు

ఖగోళంలో స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో చుక్కులు కనిపిస్తాయంటూ

డాక్టర్ అన్నదానం చిదంబరశాస్త్రి చెబుతున్న విశేషాలు 'అంతరిక్షంలో... ఆంజనేయం'లో...

- త్రిముర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే లోగిలిలో కొలువుదీరిన అరుదైన సన్నిధి అన్నవరం...

సత్య శివసుందర స్వరూపుడైన శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామి మూర్తిమత్వం అద్భుతం

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని అన్నవరం రత్నగిరిపై వైశాఖమాసంలో నిర్వహించి వార్షిక కల్యాణం గురించి

డాక్టర్ కె.విద్వత్ శ్రీనిధి మాటల్లో 'శ్రీసత్యదేవుని కల్యాణం చూడగ రారండీ!'లో...

-వీటితోపాటు శ్రీశ్రీరవిశంకర్ జన్మదినం సందర్భంగా 'స్ఫూర్తి ప్రదాత'... వీరగురునీ మాట విందామయా!...

శ్రీగణపతి సచ్చిదానంద స్వామిజీ జన్మదినం సందర్భంగా 'సద్గురుం నమామి'... పద్మావతీ పరిణయం, సీతమ్మ మాయమ్మ,

చార్‌ధామ్ యాత్రతో పాటు... ధర్మ సందేహాలు, మాసఫలం, పుస్తక సమాచారం కూడా ఉన్నాయి ఈ సంచికలో...

Reviews

There are yet no reviews for this product.