Email

భక్తి పత్రిక జూన్ 2017

Availability : In Stock

"గాయత్రీం కమలాసనాం సర్వప్రారబ్ధనాశినీం
సంసారదుఃఖశమనీం హింసాధిరూడాం భజే!"

మూలమంత్రాలకు అధిష్టాన దేవతగా కొలవబడే శ్రీ గాయత్రీమాత జయంతి ఈ మాసపు దివ్య వైభవం... శ్రీగాయత్రీమాత జయంతి జూన్ 5న జరగనుంది. ఇక యుగాలుగా ఏరువాక పండగ సదాచారంగా సంక్రమించింది... శ్రమశక్తిని, ప్రకృతిని ఆరాధించే సంప్రదాయంగా కొనసాగుతోంది... శ్రమజీవుల ఆశలకు అంకురార్పణ జరిగే ఆనంద పర్వదినం ఏరువాక పూర్ణమ జూన్ 9వ వస్తోంది... వరుణ దేవుడి అనుగ్రహంతో రైతుల కష్టాలు ఫలించాలని కోరుకుందాం...

జూన్ 25న దేశమంతా ఉత్సాహంగా జరుపుకునే జగన్నాథుని రథయాత్ర మహోత్సవానికి భక్తితో మొక్కుదాం... తెలంగాణ ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే దివ్యమైన పండుగ బోనాలు... గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించుకునే బోనాల పర్వం జూన్ 25న ప్రారంభం కానుంది. ప్రపంచానికి భారతావని అందించిన గొప్ప కానుక యోగ విద్య... మానసిక, శారీరక ఆరోగ్యాలకు దివ్యసంజీవని యోగ... యాంత్రికయుగంలో యావత్ర్పపంచం యోగసాధనని దినచర్యలో భాగంగా చేసుకుని సుఖిస్తోంది... జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసన పద్ధతులను చిరు పుస్తకంగా మీకందిస్తున్నాం.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

- ఆషాఢమాసంలో జగన్నాథ రథయాత్ర ప్రపంచప్రసిద్ధి పొందింది... ఏ క్షేత్రంలోనైనా ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు... పూరీక్షేత్రంలో మాత్రం

మూలవిరాట్లులే రథాలను అధిరోహిస్తారు... సకల జగత్తును పాలించే పరమాత్ముడు జగన్నాథుడి రథయాత్ర గురించి... సాయి శ్రీ వజ్ర వివరణ...

'జగన్నాథస్వామి నయనపథగామి'లో చూద్దాం...

- తెలంగాణలో గ్రామీణ సంస్కృతికి నిలువుటద్దం బోనాలు... కులమతాలకు అతీతమైన ఉత్సవం... ఆషాఢమాసంలో ప్రకృతి పూజకు

ప్రతీకలై... ఆదిశక్తి అమ్మదనానికి ఆనవాళ్లుగా నిలిచిన... కొత్తకుండల్లో అమ్మతల్లికి అన్నంపెట్టే పర్వదినాలైన బోనాల పండుగ

గురించి పి.శ్రీరామచంద్రమూర్తి మాటల్లో 'భక్తికి ఆనవాలు బోనాలు'లో తెలుసుకుందాం...

- ప్రతి ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం నాడు జూన్ 27వ తేదీన శ్రీ బల్కంపేట ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవం నిర్వహిస్తారు...

శుభకరమైన, శాంతస్వరూపం కల, ఊహకు, మాటకు అతీతమైన, ఆనందంతో కూడుకున్న, వేదాలకు లక్ష్యమైన, పరబ్రహ్మ స్వరూపమైన

శ్రీ రేణుకా ఎల్లమ్మ గురించి డాక్టర్ కె. పూర్ణప్రజ్ఞాభారతి వివరణలో 'రేణాకా కల్యాణం' మీ కోసం...

- బంగారు పంటలు పండాలని వానదేవుణ్ని, నేలతల్లిని కోరుకుంటూ పొలం పనులు ఆరంభించే ఆనందాల పండుగ ఏరువాక...

ఈ పండుగకు రైతు అత్యంత ప్రాధాన్యం ఇస్తాడు... పురాణాల్లో కూడా కనిపిస్తున్న ఏరువాక ప్రస్తావన... ఏరువాక విశిష్ట గురించి

డి.సాహితి మాటల్లో 'తొలకరి పలకరింత' గురించి తెలుసుకుందాం...

- నిర్దుష్టమైన అదుపుతో స్వస్వరూపాల్ని మరిచిపోయి పరమాత్మ భావనతో నిమగ్నమవ్వడమే యోగం... యోగాసనాలు ఈ లక్ష్యాన్ని సాధించడానికి

పనికొస్తాయి... యోగాసనాల ప్రాధాన్యత మంజులూరి నరసింహారావు మాటల్లో 'సమత్వమే యోగం'లో మీ కోసం...

- వీటితోపాటు ధ్యానం, యోగముద్ర, రాజయోగం, వేదమాత గాయత్రి, అక్షరధామం, హనుమత్కల్యాణం, ధర్మ సందేహాలు, మాసఫలం,

పుస్తక సమాచారం కూడా ఉన్నాయి ఈ సంచికలో...

Reviews

Friday, 16 June 2017 Rating: 5/5
the magazine was good, chala manchi vishyalu yoga asanaalu vivarinchi nanduku chala santhosham, meeru kuncham website meeda visulizing magazine meeda develop cheste chala baguntadi slow internet connection lo kuda manchi ga ande dattu cheyandi inka mobile lo chuse vedhanga kuda website ni tayar cheyandi
venkatabhargava