Email

భక్తి పత్రిక జులై 2017

Availability : In Stock

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మెశ్రీ గురవేనమః అంటూ శిరసు వంచుతాం... ధ్యాన, పూజ, మంత్ర, మోక్షాలన్నింటికీ మూలం గురువే... జులై 9న గురుపూర్ణిమ మహోత్సవం రానుంది... మనం నాగరికంగా, మానవతా విలువలతో ఉన్నతంగా జీవించడానికి కారణమైన గురువులకు వినమ్రంగా గురువందనం చేసుకుందాం. ఈ నిండు పూర్ణిమవేళ పీఠాధిపతులు, స్వాములు చాతుర్మాస్య దీక్షకు ఉపక్రమిస్తారు.

జూన్‌లో ఆరంభమైన బోనాల పర్వం ఈ మాసంలో మహోధృతంగా సాగుతుంది... బైలెల్లిన తల్లి అందరినీ చల్లంగా చూడాలని కోరుకుందాం... తెలుగింటి ఆడపడుచులు, పెద్ద ముత్తయిదువలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే మంగళగౌరీ వ్రతం ఈ నె 25న రానుంది. ఇక జులై 24 నుంచి ఆగస్టు 21 వరకు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నోములు తాంబూలాలతో, శనగల వాయనాలతో చిత్తడి చినుకుల మధ్య తెలుగు లోగిళ్లకు వినూత్న శోభ తేనున్నాయి.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

- శక్తి ఆరాధనలో జానపదులు జరుపుకునే అతిపెద్ద జాతర బోనాలు... ఆషాఢమాసంలో బోనాల పండుగకు తెలంగాణ తంగేడు

పువ్వులా పరిమళిస్తుంది... బోనాల సందర్భంగా దుర్గతి, దుఃఖం, దుష్టత్వం, దుస్సాధ్యం అన్నింటినీ నశింపచేసే శక్తి జగన్మాతను

ఆరాధిస్తారంటున్న డాక్టర్ విద్వత్ శ్రీనిధి 'తల్లీ... బోనమెత్తినామమ్మా!'లో చూద్దాం...

ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు... ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు

యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తికంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు తిరిగి మేల్కొంటాడు... తొలి ఏకాదశి పర్వం

విష్ణుభక్తులకు పరపవిత్రం అంటున్న... ధర్మప్రియ... 'మోక్షానికి సాపానం తొలి ఏకాదశి'లో తెలుసుకుందాం...

- మనిషిని మనీషిగా తీర్చిదిద్దేది గురువే... గురుపాదం పూజకు కారణం, గురువాక్యం మంత్రానికి ఆద్యం, గురుకృపయే మోక్షం,

శుభకరమైన, శాంతస్వరూపం కల, ఊహకు, మాటకు అతీతమైన, ఆనందంతో కూడుకున్న, వేదాలకు లక్ష్యమైన, పరబ్రహ్మ స్వరూపమైన

గురుకృపయే మోక్షం, ఆచార్యుడు, తండ్రి, అన్న, రాజు, మేనమామ, మామ, తల్లి, మతామహుడు, పితామహుడు, కులంపెద్ద, పినతండ్రి...

ఈ 11 మందీ గురువులేనని శాస్త్ర కథనం... ఎవరు ఏ విద్య నేర్పినా ఆయన గురు సంబోధనతో

వందనీయుడే అంటున్న... సూర్యకిరణ్ మల్లాది... 'జ్ఞానసిద్ధికి తెరవు గురువు'లో నేర్చుకుందాం...

- వికాసమే జీవనం... సంకోచమే మరణం... మనపై మనకు విశ్వాసం, భగవంతుడిపై విశ్వాసం అనేవి పరిపూర్ణ వికాస మంత్రాలు...

ముప్పై మూడు కోట్ల పౌరాణిక దేవతలపైన మీకు నమ్మంక ఉన్నా... మీపై మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే నిష్కృతి ఉండదని

చాటిన నిత్యచైతన్య స్ఫూర్తి స్వామి వివేకానంద న్యూయార్క్ ప్రసంగంలోని కొంత భాగాన్ని 'నా గురుదేవుడు'లో చూద్దాం...

- వీటితోపాటు గరుడపంచమి, పండుగలకు నెలవు దక్షిణాయనం, వ్యాసాయ విష్ణురూపాయ, దొరకునా ఇటువంటి సేవ,

సౌభాగ్యప్రదం మంగళగౌరీ వ్రతం, ధర్మ సందేహాలు, మాసఫలం, పుస్తక సమాచారం కూడా ఉన్నాయి ఈ సంచికలో...

ఇక ఈ సంచికతో పాటు మంగళౌరి, వరలక్ష్మీ వ్రత కల్పాలను చిరుపుస్తకంగా అందిస్తున్నాం...

Reviews

There are yet no reviews for this product.