Email

భక్తి పత్రిక ఆగష్టు 2017

Availability : In Stock

ముత్తయిదువలు భక్తిప్రపత్తులతో అమ్మవారినే కొలిచే శ్రావణ శుక్రవారం ఆగస్టు 4వ తేదీన రానుంది... ఆ వరాలతల్లి కోరిన శుభాలన్నింటినీ అందించాలని కోరుకుందాం... ఈ సంచిక శ్రావణ భాద్రపదాలకు సేతువై, వ్రతాలకు, పండుగలకు నెలవై రూపొందింది. శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఆగస్టు 7న రక్షాబంధన్ వస్తుంది... అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లతో ఆత్మీయంగా రక్షాబంధనాన్ని జరుపుకుందాం... ఆగస్టు 15న కృష్ణాష్టమి రానుంది... ఉట్టికొట్టి సరదాగా సంబరాల్లో పాల్గొందాం.

ఆగస్టు 25న ప్రారంభమై పదిరోజుల పాటు విఘ్నరాజ వినాయక వ్రతం సందడిగా సాగనుంది.... ఆది దేవుడైన విఘ్నేశ్వరుడు అందిరికీ పూజ్యుడు... చదువులిచ్చే బొజ్జ గణపయ్య పిల్లలకు పరమ ఆప్తుడు... వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడికి ఇష్టమైన పత్రి, పూలను సేకరించి స్వామిని పూజించుకుంటారు. ఇక కృత్రిమ రంగుల హంగులతో ప్రకృతికి, పరిసరాలకు ముప్పుతెచ్చే వినాయకు విగ్రహాలకు స్వస్తి పలికి... నలుగుపిండితో ఉద్భవించిన గణపయ్యను మామూలు మట్టితో మలచుకుందాం... పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం...
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

-వినాయకుడు మనందరి మనసులకూ దగ్గరివాడు... పురాణకర్తల నుంచి జానపదుల వరకు అందరూ

వినాయకుని గుణనామాలను కీర్తించిన వారే... పత్రి పూజ నుంచి నిమజ్జనం వరకు గణపతి పూజలోని

ప్రతి అంశంపై ముక్తేవి భారతి చెప్పిన విషయాలను 'తుండం దేవరకు తొలి దండాలు'లో చూద్దాం....

-దేశవ్యాప్తంగా మహిమాన్విత గణపతి క్షేత్రాలెన్నో ఉన్నాయి... వాటిలో పురాణప్రశస్త్యం పొందినవి...

చారిత్రక ప్రసిద్ధి కలిగిన దేవాలయాలు అనేకం... పరిశోధకులకు, విజ్ఞానవేత్తలకు అంతుబట్టని రహస్యాలెన్నో

వినాయక ఆలయాల్లో కానవస్తాయి... ఆ వివరాలను 'అపురూపం గణపతి రూపం'లో తెలుసుకుందాం...

-తుండము నేకదంతము గల గణపతి క్షేత్రాలు తెలుగురాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి...

ప్రతి శైవక్షేత్రంలోనూ వినాయకుని ఆలయం తప్పనిసరిగా ఉంటుంది...

తెలుగురాష్ట్రాల్లో సుప్రసిద్ధిమైన వినాయకుని ఆలయాలను 'తెలుగింటి గణపతి'లో చూద్దాం...

-తెలుగుసీమ ముత్తైదువులంతా ఐదోతనాన్ని సుఖసంపదలను ప్రసాదించే మంగళగౌరీ, వరమహాలక్ష్మీ వ్రతాలు

చేసుకునే ఆనందకరమైన మాసం శ్రావణమాసం... ఈ మాసంలో ప్రతీ ఇల్లూ మామిడాకు తోరణాలూ,

పసుపు కుంకుమలు రాసిన పసిడి ఛాయ గడపలతో కళకళలాడుతుంటాయి...

వరలక్ష్మీ ప్రతం ప్రత్యేకతను 'సౌభాగ్యలక్ష్మీ రావమ్మా...'లో తెలుసుకుందాం...

-శ్రీకృష్ణ జననం లీల... నిర్యాణం లీల... నడుమ జరిగిన నాటకమూ లీలయే... ఆ లీలల్లో పరమాత్మతత్త్వం

దాగుంది... భక్తులకు తరింపచేసింది... మానవ సహజరమైన వాత్సల్యం, భయం, కోసం కామం,

భక్తి, స్నేహం వంటి భావాలన్నీ కృష్ణపరం చేసి తాపసులు కైవల్యం పొందారంటున్న

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వివరణ 'నరుని నడిపిన నారాయణ లీల'లో చూద్దాం...

- వీటితోపాటు విశ్వమంతా వినాయకుడు, స్ఫూర్తి విఘ్నేశ్వరుని మూర్తి, వరలక్ష్మి మంగళహారతి,

అనుబంధానికి రక్షాబంధన్‌, రాధాగోవింద బృందావనం, గోకులాష్టమి, ధర్మ సందేహాలు, మాసఫలం,

పుస్తక సమాచారం కూడా ఉన్నాయి...

ఇక ఈ సంచికతో పాటు శ్రీవినాయక వ్రతకల్పం చిరుపుస్తకాన్ని కూడా అందిస్తున్నాం...

Reviews