Email

భక్తి పత్రిక సెప్టెంబర్ 2017

Availability : In Stock

అమ్మవారి శరన్నవరాత్రులు వచ్చేశాయి... జగగన్మాత తొలి మూడు రోజులూ మహాకాళిగా... మహాదుర్గగా అవతారమెత్తింది... తర్వాత మహాలక్ష్మిగా... చివరి మూడు రోజులూ మహాసరస్వతిగా దుష్ట రాక్షసులను చీల్చిచెండాడింది... పదోనాడు అపరాజితగా విజయోత్సవాలు జరుపుకుంటుంది... అదే విజయదశమి, దేశమంతటా దుర్గామాతను కృతజ్ఞతాభావంతో ఆరాధించే దసరా... శరన్నవరాత్రులు ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. విజయదశమికి ముందు దుర్గాష్టమినాడు 28న ఆయుధ పూజ జరుపుకుంటారు... అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నాం....

దసరా అంటే వెంటనే గుర్తుకు వచ్చే సంబరాలు బతుకమ్మ సంబరాలు... దసరా తరుణంలో ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు బంగారు బతుకమ్మను ఊరూరా ఓలలాడించే సంబురాలు వస్తున్నాయి... పసుపు పూల బతుకమ్మను జానపద ఆటపాటలతో తెలంగాణ ఆడపడుచులు కొలవడం ఆనవాయితీ... జమ్మి ఆకులను వెండి బంగారంగా పెద్దలకు పంచి దీవెనలు అందుకోవడం, పాలపిట్టను దర్శించడం ఈ దసరా వేడుకల్లో ముఖ్యభాగాలే... మానవ సంబంధాలను ఉద్దరించే అలయ్ బలయ్ వేడుక తెలంగాణ సంస్కృతిక దర్పణం... ఇక ఇదే నెలలో 12 నుంచి 23 వరకు కావేరీనది పవిత్ర పుష్కరాలు... దక్షిణ భారతాన్ని పవిత్రం చేయనున్నాయి... ఈ నెల 23న బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ఆరంభంకానున్నాయి.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

- సృష్టి, స్థితి, లయ కార్యాలను నిర్వర్తించడానికి త్రిమూర్తులను సృజించింది జగన్మాతయే... సత్త్వరజస్తమో

గుణాలకు వారిని ప్రతినిధులుగా పేర్కొంది.. త్రిమూర్తులకు జగన్మాత శక్తిప్రదానం చేసిందంటున్న

ఆచార్య బేతవోలు రామబ్రహ్మం... 'అప్రమేయం... దేవీతత్త్వం'లో... తెలుసుకుందాం...

- నవరాత్రి ఉత్సవాల పేరు వినగానే నూతనోత్తేజంతో మనసు ముప్పిరిగొంటుంది... భక్తి సమ్మిళితమైన

ఉత్సాహవాతావరణం ఈ తొమ్మిది రోజులూ ఉంటుంది... ఓ అద్భుత దివ్యానుభూతికి

నిదర్శనమై నిలిచే దసరా గురించి... 'దసరా... పరవశం'లో చూద్దాం...

- దసరా వచ్చిందంటే చాలు బతుకమ్మ సంబురాలతో తెలంగాణ పూలసజ్జలా మారుతుంది... పువ్వులను ప్రకృతి

స్వరూపిణి పార్వతిగా పువ్వులను ఆరాధిస్తారు... రంగురంగుల పూలతో బతుకమ్మలను రూపొందిస్తారు... మహిళలంతా

తొమ్మిది రోజుల పాటు జరుపుకునే సంబరాల గురించి 'బంగారు బతుకమ్మ ఉయ్యాలో'... లో చూద్దాం...

- ఏకత్వంలో భిన్నత్వం మనకు ప్రత్యేకం... భిన్న సంప్రదాయాలున్నా దేశప్రజలందరూ కలిసి జరుపుకునే

విశష్టమైన పండుగలెన్నో ఉన్నాయి... వాటితో అగ్రపూజ దసరా దుర్గమ్మకే దక్కుతుంది...

ఇంకా దసరా విశేషాలను డీఆర్ స్రవంతి మాటల్లో... 'దసరా... అలయ్... బలయ్...'లో తెలుసుకుందాం...

- కనులకు మిరుమిట్లు గొలిపే దీపతోరణాలతో... అఖండజ్యోతులతో... జిగేల్మనే నవరత్న హార సంచయంతో...

కర్ణపేయమైన వేదఘోషలతో... భక్తిభావ లహరులైన పాటలతో... గోవిందానామాలతో సప్తగిరులు శోభిల్లే సమయం రానేవచ్చింది...

కోరినకోరికలు తీర్చే 'బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం' గురంచి వివరంగా తెలుసుకుందాం...

- ఆగస్త్యుని కమండలం నుంచి జాలువారిన పణ్యనది కావేరి... ఆ నదీతీరం వెంట ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి...

సమతావాదం నేర్పిన శ్రీమద్రామానుజుని కార్యక్షేతం కావేరీ తీరం... కావేరీ పుష్కరాల సందర్భంగా

పుణ్యనది కావేరి విశిష్టతను డి. శ్రీనివాస దీక్షితులు మాటల్లో 'పుష్కర కావేరి'లో చూద్దాం...

- వీటితోపాటు దేవీ ఉపాసన, మహాశక్తి పీఠాలు, జగదంబ దివ్య దర్శనం, జయహో దుర్గా భవాని,

కోటిదీపాల పండుగ... ధర్మ సందేహాలు, మాసఫలాలు కూడా ఉన్నాయి...

ఇక ఈ సంచికతో పాటు '99 నిత్యసందేహాలు' చిరుపుస్తకాన్ని కూడా అందిస్తున్నాం...

Reviews

There are yet no reviews for this product.