Email

భక్తి పత్రిక నవంబర్ 2017

Availability : In Stock

మహాదేవుని దయ, మహనీయుల దివ్యాశీస్సుల బలంతో మేం సంకల్పించిన నాటి నుంచి కోటి దీపోత్సవం విజయవంతంగా సాగుతోంది... అశేష భక్తజనం మా సంకల్పాన్ని సమాదరిస్తూ సహకరిస్తూ ఉత్సవానికి వెలుగులద్దుతున్నారు. అందరికీ వినమ్ర ప్రమాణాలు చేస్తున్నాం... దీపోత్సవంలో చోటు చేసుకుంటున్న పీఠాధిపతుల, మఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, పెద్దల ప్రవచనాలు, మహనీయుల మంగళాశాసనాలతో పాటు భక్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాలతో వెన్నెలకు పరిమళం అబ్బుతోంది.

అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలోనే కాకుండా... కొనసాగింపుగా విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో నవంబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ కోటిదీపోత్సవం జరుగుతుంది. ఇది మా రచనా టెలివిజన్ చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాం... ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తజనం మీకు అనువైన చోటికి విచ్చేసి ఈ దీపయజ్ఞాన్ని జయప్రదం చేయాలని ప్రార్థిస్తున్నాం.

సమతను, మమతను పెంచే కార్తిక వన సమారాధనలు... ఊరూవాడా జరుగుతాయి... అన్ని భేదాలను విస్మరించి సహపంక్తి భోజనాలకు తెరతీసే మాసం ఇది... ఇటీవల కాలంలో కులాలవారీ, తెగలవారీ, శాఖల వారీ వనభోజనాలకు నాంది పలికారు... ఇలాంటి విందులకు స్వస్తి పలుకుదాం... కార్తిక మాస లక్ష్యాన్ని చాటి చెబుదాం. కార్తికంలో అయ్యప్ప దీక్షలు స్వీకరించి భక్తులు మాలలు ధరిస్తారు... స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోష శమరిమల దాకా చేరుతుంది... అయ్యప్ప స్వాముల దీక్షలు షపలం కావాలని ఆక్షాంక్షిస్తున్నాం...
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

- పరబ్రహ్మలింగం భజే పాండురంగ అన్నారు ఆదిశంకరులు... సాలప్రామ శిలను విష్ణులింగంగా... నర్మద బాణశిలను శివలింగంగా,

శోణశిలను గణేశలింగంగా, సువర్ణముఖీనదిలో లభించే శ్రీచక్రాన్ని శక్తిలింగంగా భావిస్తారు అంటున్న సామవేదం షణ్ముఖశర్మ వివరణను

'విశ్వమంతా శివుడు'లో తెలుసుకుందాం....

 

- ఆశ్వయుజ అమావాస్య మానవులకు దీపావళి... కార్తిక పున్నమి దేవ దీపావళి... అందుకు గుర్తుగానే కార్తికపున్నమినాడు

శివాలయాల్లో జ్వాలా తోరణం నిర్వహిస్తారు... జ్వాలాతోరణ భస్మాన్ని భక్తులు దిష్టిచుక్కగా ధరిస్తారు...

జ్వాలాతోరణానికి సంబంధించిన విశిష్టతను 'జ్వాలాతోరణం'లో చూద్దాం...

 

-దీపంతో కనిపించే నీలం, పసుపు, తెలుపు వర్ణాలు మనలోని త్రిగుణాలకు ప్రతీకలు... సరస్వతి, లక్ష్మి, దుర్గ... ఆ త్రివర్ణాల్లో

భాసిల్లుతూ ఉంటారని... విజ్ఞానం, వివేకం, వినయమనే సందేశాలు ఈ మూడు రంగుల ద్వారా వెల్లడతాయంటారు. మానవ శరీరం

మట్టితో చేసిన ప్రమిద, ప్రాణం ప్రకాశించే దీపం, అధ్యాత్మిక సాధన అందులో పోసే తైలం... భగవంతుడికి భక్తుడు చేసే

షోడశోపచారాల్లో దీపసమర్పణ ముఖ్యమంటున్న ధర్మప్రియ వివరణను 'కార్తిక దీపం'లో తెలుసుకుందాం...

 

- తిరుచానూరులో వెలిసిన శ్రీపద్మావతీ అమ్మవారికి కార్తికమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి...

అమ్మవారి జన్మతిథి అయిన కార్తిక బహుళ పంచమి నాడు పంచమీతీర్థంతో ఈ ఉత్సవాలు పూర్తవుతాయి...

నవంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న తిరుచానూరు బ్రహ్మోత్సవాల గురించి 'అలమేలమ్మకు పంచమీతీర్థం'లో చూద్దాం...

 

- శిక్షణతో కూడిన జీవితం అంచెలంచెలుగా అభివృద్ధిని సాధించిపెడుతుంది... అందుకు దైవం కూడా

సహాయం అందిస్తాడు... లక్ష్యసాధనకు నమ్మకం, దృఢ సంకల్పం, ఏకాగ్రత కావాలి... అందుకు ఉపకరించేవే

దీక్షలు... వ్రతాలు... అటువంటి దీక్షల్లో అయ్యప్పస్వామి మండల దీక్ష అందరికీ సులభసాధ్యమైనది అంటున్న

మహాభాష్యం నరసింహారావు విశ్లేషణను 'దీక్ష-రక్ష'లో తెలుసుకుందాం...

 

వీటితో పాటు శ్రీతులసీ హరితుసీ, పుణ్యవారాశి కాశి, నక్షత్ర దర్శనం, గురువాయూరప్ప, భూకైలాస్,

కైలాసవాసా ఈశా!తో పాటుగా... ధర్మసందేహాలు, మానఫలం, మహాతికి తోడుగా...

దీక్షాధారులకు కరదీపికగా అయ్యప్ప పూజావిధి... నిష్టలూ, నియమాలు తెలిపే చిరుపుస్తకాన్ని ఈ సంచికతో అందుకోవచ్చు...

Reviews

There are yet no reviews for this product.