Email

భక్తి పత్రిక డిసెంబర్ 2017

Availability : In Stock

మహాదేవుని కరుణా కటాక్ష వీక్షణాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో దేదీప్యమానంగా భక్తిపారవశ్యాన్ని నింపిన భక్తిటివి కోటి దీపోత్సవం దిగ్విజయంగా ముగిసింది. ఎందరో మహనీయుల దివ్యాశీస్సులతో రెండు తెలుగు నగరాల్లో దీపోత్సవం సరికొత్త చరిత్ర సృష్టించింది. 23రోజుల పాటు సాగిన ఈ దీపయజ్ఞం అణువణువునా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించింది. లక్షలాది మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచింది. ఇంటింటా పవిత్ర దీపాలు వెలిగాయి. అవి అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన జ్యోతులయ్యాయి. దీపం పరబ్రహ్మ స్వరూపంగా బాసిల్లాలనే మా సంకల్పం సఫలమైంది. ఇంకా రాబోయే కార్తిక మాసాలను కూడా ఇదే స్ఫూర్తితో, భక్తి శ్రద్ధలతో కాంతిమయం చేయాలన్నదే మా ఆకాంక్ష.

ఈ మాసం ఆరంభంలో హనుమద్ర్వతం, దత్తాత్రేయ జయంతి,అన్నపూర్ణా జయంతి, తిరువణ్ణామలై కార్తిగై దీపం రావడం విశేషంగా చెప్పవచ్చు. డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం ఆరంభమౌతుంది. రాబోయే సంక్రాంతికి నాంది పలుకుతూ నేలతల్లిని అలంకరించే సందడి మొదలౌతుంది. రంగవల్లులు, గొబ్బిళ్లు కనుల విందు చేసే సంక్రాంతి నెల కళాత్మకంగా సాగుతుంది. డిసెంబర్ 17న కొమరవెల్లి మల్లన్న కల్యాణం భక్తకోటికి దివ్య విశేషం. ఇంకా మహాను భావుడు శ్రీరమణ మహర్షి అవతరించిన రోజు డిసెంబర్ 30. పూర్ణయోగి అరవిందుని మహాసమాధి కూడా ఈ నెల 5 వతేదీనే.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

-ధనుర్మాసం నెలరోజులూ ఉదయాన్నే గోదాదేవి రచించిన పాశురాలను గానం చేస్తుంటారు. తిరుప్పావై దివ్య ప్రబంధ అనుసంధానంతో

భగవంతుడి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని భక్తుల నమ్మకం. ఇంకా తిరుప్పావైని సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమే అయిన గోదాదేవి

రచించడమే ఇందుకు కారణం. 'కావేటి రంగా... కరుణాంతరంగా'! లో యల్లాప్రగడ మల్లికార్జున రావు వివరణను తెలుసుకుందా.!

 

-నిరాకార నిర్గుణ స్వరూపమే పరబ్రహ్మం. సృష్టి స్థితి లయలకు కారణభూతుడు, సర్వ శక్తిమంతుడు,

అన్ని జీవులనూ పోషించేవాడు శ్రీమహా విష్ణువే. మార్గశిర, ధనుర్మాసాల సంధికాలంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన సకల శుభాలను

ప్రసాదిస్తుంది అంటున్న 'విష్ణుం వందే' లో అప్పాల శ్యామ ప్రణీత్ శర్మ వివరణను తెలుసుకుందాం!.

 

-అత్రి వరదుడైన దత్తాత్రేయుడు ఆది గురువు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకరూపంగా అవరించినవాడు.

త్రిగుణాతీతుడైన శ్రీమన్నారాయణుని ఆరో అవతారంగా చెబుతారు. చూసే దృష్టి ఉంటే సృష్టిలో అణువణువునా గురు స్వరూపాలు

దర్శనమిస్తాయని దత్తగురువు ప్రవచించారని అంటున్న 'కల్పతరువు దత్తగురువు'లో డి. శ్రీనివాస దీక్షితులు వివరణ తెలుసుకుందాం!.

 

- శ్రీరామదూత హనుమంతుడు ప్రతిచోటా కొలువుదీరి ఉంటాడు. హనుమంతుడు కేవలం దేవతామూర్తి కాదు.

మంత్రమూర్తి, రాజనీతిజ్ఞుడు, యోగ స్వరూపుడు, యుద్ధ విశారదుడు, అన్నింటినీ మించి ధర్మమూర్తి. హనుమద్ర్వతం

విశిష్టమైంది, సకల హితాలను చేకూరుస్తుంది అంటున్న శ్రీ 'ఆంజనేయం'లో కప్పగంతు రామకృష్ణ వివరణ తెలుసుకుందాం!.

 

- వైకుంఠ ఏకాదశి పర్వదినాన విష్ణుమూర్తి ఆలయాలన్నీ కిటకిటలాడతాయి. తెల్లవారు జామునుంచే

ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేస్తే మోక్షం లక్షిస్తుందని,

ముక్కోటి దేవతల ఆశీస్సులు లక్షిస్తాయని అంటున్న 'కోటి పుణ్యాల ముక్కోటి' లో టివికె రాఘవన్ వివరణ తెలుసుకుందాం.!

 

- వీటితో పాటు భద్రాద్రి తెప్పోత్సవం, ఖగోళంలో వైకుంఠం, ఉత్తర ద్వారా దర్శనం, ఆనంద నిలయంలో పాశుర సుప్రభాతం,

కొమర వెల్లి మల్లన్న జాతర, అరుణగిరి దీపం, దివ్వెకో దీవెన దీపోనికో ఆశీస్సు, అభిషేక ప్రియనే.. శరణమయ్యప్పా!,

రమణాశ్రమం మౌన ప్రబోధం, అన్నపూర్ణాదేవీ అర్చింతునమ్మా, ప్రకృతికి పూజ, ధర్మసందేహాలు, మాస ఫలం వంటి

విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంచికతో పాటు తిరుప్పావై అనే చిరు పుస్తకాన్ని కూడా పొందవచ్చు.

Reviews

There are yet no reviews for this product.