Email

భక్తి పత్రిక జనవరి 2018

Availability : In Stock

ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశిస్తూ.. తెలుగు లోగిళ్లకు సంక్రాంతి శోభలందిస్తున్నాడు. ఉత్తరాయణ పూర్వకాలం ఆరంభమౌతుంది. పండుగ సంబరాలతో పాటు పితృ దేవతలను ఆరాధించుకునే పర్వం కూడా ఇదే కావడం విశేషం. నూతన సంవత్సరారంభ భక్తి సంచికతోపాటు 2018రాశిఫలాలను అనుబంధంగా అందిస్తుంది ఈ సంచిక.

కొత్త ధాన్యాలతో పాలపొంగళ్లతో, రంగవల్లులతో వాకిళ్లు కళకళలాడుతుంటాయి. అలాగే అక్రమపాలనపై తిరగబడి ఆత్మబలిదానం చేసుకున్న ధీరవనితలు సమ్మక్క, సారక్కల మేడారం జాతర జనవరి31న అత్యంత ప్రభావవంతంగా జరగనుంది. అలాగే భారతీయ తత్త్వ చింతనకు స్వర్ణగోపురమైన స్వామి వివేకానంద జన్మదినం జనవరి 12 సంక్రాంతి పర్వదినానికి నాంది. ఇంకా శబరిమల పవిత్ర మకరజ్యోతి జనవరి 14న సాక్షాత్కరించనుంది. భారతీయులంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనే జాతీయ పండుగ జనవరి 26.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

- గాలి, నేల, నీరు, తేజస్సు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు యజమానుడు అనే ఎనిమిది శరీరాలతో పరమేశ్వరుడు

ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. శ్రీమన్నారాయణుని కుడి కన్నుగా సూర్యుడు స్వామికి లోకాన్ని చూపిస్తున్నాడు వంటి

అద్భుత విషయాలు తెలుసుకోవాలంటే 'సూర్యోపాసన'లో పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ వివరణ ద్వారా తెలుసుకుందాం.

 

- పండుగలు మన సంస్కృతికి చిహ్నాలు. సంప్రదాయ వైభవాలు. పర్వం అనే శబ్దం నుండి పబ్బం పండుగ అనే రూపాలు

వచ్చాయి. ఈ అంశాలన్నింటినీ 'సిరుల బంతి సంక్రాంతి' లో రాయసం చరణశ్రీ వివరణ ద్వారా తెలుసుకుందాం.

 

- సూర్య నమస్కారాల వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యపరమైన రక్షణ లభిస్తుంది. ఇంద్రియాలకు పటుత్వం వస్తుంది. దీర్ఘాయువు

పొందుతారు వంటి విషయాలను 'ఆరోగ్య దీపికలు సూర్య నమస్కారాలు' లో కప్పగంతు రామకృష్ణ గారి వివరణ ద్వరా తెలుసుకుందాం.

 

- సూర్యుడు కర్మసాక్షి. ప్రత్యక్ష నారాయణుడు. భక్తి సమ్మిళిత ఆర్తితో పూజిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది.

మహాభారతంలోని అరణ్యపర్వం ప్రథమాశ్వాసంలో ధర్మరాజు సూర్యప్రసాదంగా అక్షయపాత్రను పొందిన సందర్భం ఉంది. ఆ విశేషాలు

తెలుసుకోవాలంటే 'సూర్యప్రసాదం అక్షయపాత్ర'లో యల్లాప్రగడ మల్లికార్జున రావు వివరణ ద్వారా తెలుసుకుందాం.

 

- రథ సప్తమి నుంచి సూర్యరథ వేగం తగ్గుతూ వేడిమి పెరుగుతుంది. దీపావళి నాటికి దీపమంత చలి ఉంటుంది.

భోగిమంటల వేళదాకా ముమ్మరంగా ఊపేస్తుంది. రథసప్తమి నాటికి సూర్యరథాలు నిలబడి భూమికి వెచ్చదనాన్ని

పెంచుతాయి. ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'మహిమాన్వితం రథసప్తమి'లో వివరణ చూడండి.

 

- మాఘ పూర్ణిమ వేళ సముద్రస్నానం చేయాలంటారు. వైశాఖం, ఆషాఢం, కార్తీక, మాఘ మాసాల్లో పుణ్యతీర్థ సముద్రస్నానాలు

చేయడం ముక్తిదాయకం. ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'మాఘస్నాన మహత్యం'లో ధర్మప్రియ వివరణ ద్వరా తెలుసుకోండి.

 

- వీటితో పాటు భారతమాతకు జేజేలు, శ్రీమదనానంద పీఠం, అతీత ప్రజ్ఞ, ధర్మ సందేహాలు, జనవరి 2018 మాసఫలం

వంటివి కూడా చూడవచ్చు. వీటితో పాటు 2018 మీ రాశిఫలాలు అని చిరు పుస్తకాన్ని కూడా పొందవచ్చు.

Reviews

There are yet no reviews for this product.