Email

భక్తి పత్రిక ఫిబ్రవరి 2018

Availability : In Stock

శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి

శివరాత్రి మహాపర్వం ఫిబ్రవరి 13న వస్తుంది. దేశంలోని శివక్షేత్రాలన్నీ శివనామంతో మార్మోగుతుంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ శివాలయాల్లో మాత్రమే కాదు మారుమూల గుళ్లలో కూడా అభిషేకాలు విశేష పూజలు జరుగుతాయి. శ్రీశైల మల్లన్న, శ్రీకాళహస్తీశ్వరుడు బ్రహ్మోత్సవాలు జరిపించుకుంటున్న వేళ అందరికీ శుభాలివ్వాలని కోరుకుందాం.

ఈ మాసంలో శివరాత్రితో పాటు పిలిస్తే పలికే దేవుడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి జయంతి ఈ నెల 22న భక్తులకు పండుగ తెస్తుంది. పన్నెండేళ్లకోసారి వచ్చే శ్రావణ బెళగొళ (కర్ణాటక) శ్రీ గోమఠేశ్వర మహామస్తకాభిషేకం ఉంది. ఈ నెల ల17 నుంచి తొమ్మిది రోజులపాటు జరిగే ఈ పుణ్య అభిషేకోత్సవానికి లక్షలాది భక్తజనం తరలివచ్చి తరిస్తుంది. అలాగే శ్రీనివాస మంగాపురం (5నుంచి 14వరకు), తరిగొండ లక్ష్మీనృసింహ 22 నుంచి మార్చి3 వరకు బ్రహ్మోత్సవాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

- శివుడు కానిది అంటూ సృష్టిలో ఏదీ లేదు. ఆయన అంతటా నిండిపోయిన వాడు. అన్నీ ఆయనే అయినవాడు. ఏమీ కానివాడు కూడా ఆయనే.

రూపం లేని వాడు. వేదమయం రూపం ఉన్నవాడు కూడా ఆయనే. అందుకే ఆయన అరూపరూపి. అదే శివలింగ స్వరూపం. జ్యోతి స్వరూపుడైన

శివుని లింగోద్భవ లీల సాగిన మహాశివరాత్రి పర్వాలలో మహాపర్వం. 'జన్మకో శివరాత్రి' వ్యాసంలో చాగంటి కోటీశ్వరరావు రాసిన వివరణ చూద్దాం.

 

- శివపంచాక్షరి మహామంత్ర రాజం, శివ అనే రెండక్షరాలు పాపరాశిని దగ్ధం చేసి ఆనందాన్ని.. సుఖాన్ని అందిస్తాయి. నమకంలోని

ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మించినది లేదంటారు. పంచాక్షరీ మంత్రశక్తిని గురించి 'కంచిపరమాచార్య

శ్రీ చంద్రశేఖర సరస్వతీ మహాస్వామి అమృత వాణి... జగద్గురు బోధల' నుంచి వివరణ చూద్దాం...

 

- విశ్వేశ్వరుణ్ణి విశ్వరూపంగా ఉపాసించడం ఉత్తమ స్థాయికి చెందిన సంస్కారం. భగవంతుడు కనిపించడు అని మనం అంటే...

కనిపించేదంతా భగవంతుడే అని చెబుతుంది ఆర్షవిజ్ఞానం. 'అష్టమూర్తి తత్త్వం' లో సామవేధం షణ్ముఖ శర్మ రాసిన వివరణ చూద్దాం...

 

- భిన్నత్వంలో ఏకత్వం సృష్టి అంతటా ఉంది. ఈ సృష్టిలోని సూర్య చంద్రులు, నక్షత్రాలు, మోఘాలు, నీరు, భూమి సమస్తం ఒకే పదార్థంతో

తయారయ్యాయి. ఆ ఒక్క పదానికే శివం అని పేరు. జీవం ఉన్న ప్రతి వస్తువులోనూ శివతత్త్వం ఉంది. 'శివం సుదరం' లో శ్రీశ్రీ రవిశంకర్ రాసిన వివరణ చూద్దాం.

 

-ఈశా యోగా కేంద్రం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 10వ తేది నుంచి పలు ఆసక్తికరమైన కార్యక్రమాలు

చోటుచేసుకుంటాయి. ఆది యోగి ప్రదక్షణ, సంగీత, నృత్య ధ్యానాలతో కోయంబత్తూరులోని సద్గురు ఆశ్రమం శివనామాంకితం

కాబోతుంది. 'ధ్యానం యోగం సర్వం' లో సద్గురు జగ్గీవాసుదేవ్ రాసిన వివరణ చూద్దాం.

 

- రసజ్ఞత శివస్వరూపం. సహిష్ణుత శివతత్త్వం. ఆకలి, నిద్ర, గూడు, గుడ్డ అన్నీ శివుడే. అన్నింటిలో తానే ఉన్నాడు. జగమంతా తానే అయినవాడు

శివుడు. యోగమూ శివుడే.. భోగమూ శివుడే... ఆయనది ప్రధానంగా జ్ఞానదృష్టి. 'ఈ జీవితమే శివాజ్ఞ' లో డా. గరికపాటి నరసింహారావు రాసిన వివరణ చూద్దాం.

 

- వీటితో పాటు చేదుకో కోటయ్య, జీవేశ రక్షింపవే..., శివ మానస పూజ, శ్రీరుద్రం, నమకం చమకం, విశ్వమే మహాశివలింగం, పంచానన..

పరమేశా.!, మతం అభిమతం అంతా శివుడే, నవరసాభిషేకం, భక్తుడూ శివుడే వంటి వ్యాసాలు తెలుసుకుందాం. అలాగే ధర్మసందేహాలు,

ఫిబ్రవరి.. మాసఫలం వంటివి తెలుసుకుందాం. ఈ పుస్తకంతో పాటు దేశంలోని శివక్షేత్రాలను దర్శింపజేసే చిన్న పుస్తకాన్ని అనుబంధంగా అందుకోండి.

Reviews

There are yet no reviews for this product.