Email

భక్తి పత్రిక ఏప్రిల్ 2018

Availability : In Stock

మా గురుదేవులు కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామి సిద్ధి పొందడం మానవాళికి తీరనిలోటు. వారు సనాతన హైందవ ధర్మాలకు మారుపేరుగా నిలిచారు. మా శ్రేయా గురువుగా వారు సదా మా మనసులోనే ఉంటారు. భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవానికి అనారోగ్యాన్ని కూడా లెక్క చేయక ప్రతి ఏటా విచ్చేసి.. అశేష భక్తి కోటిని ప్రత్యక్షంగా దీవించేవారు. ఇది మేము మరువలేని మధురస్మృతి. వారి ఆత్మశక్తి సదా మా వెన్నంటి ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని ఆ పరమ గురువును ప్రార్థిస్తున్నాం.

అద్వైత చక్రవర్తి ఆదిశంకర జయంతి ఈ మాసం 20న రావడం ఆనందదాయకం. 21న శ్రీరామానుజ జయంతి వస్తుంది. అలాగే.. సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరుపుకొని 18న అశేష భక్తకోటికి నిజరూప దర్శనం ఇవ్వనున్నాడు. ఇంకా ఏప్రిల్ 26 అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి పెళ్లి పీటలపై దర్శనమిస్తాడు. 29న ద్వారకాతిరుమల చినవెంకన్న కల్యాణం వైభవంగా జరగనుంది. 30వ తేదీన అన్నమయ్య జయంతిని భక్తి ప్రపత్తులతో జరుపుకోబోతున్నాం.24న శ్రీ సత్యసాయి ఆరాధనోత్సవం దేశవిదేశాల్లో జరగనుంది. కాగా ఏప్రిల్ చివరిరోజును బుద్ధపూర్ణిమ వస్తుంది.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

- సంపద మన ఆధీనంలో ఉండాలి కానీ.. మనం దానికి బానిసలం కాకూడదు. ఏమాత్రం గర్వం, అహంకారం మనలో ఏర్పడినా వెంటనే

ఐశ్వర్యం చేజారుతుంది. ఇందుకు సంబంధించిన వివరణను అప్పాల శ్యామప్రణీత్ శర్మ రాసిన 'లక్ష్మీ కటాక్షం' చూద్దాం.

 

- ఆదిశంకరులు స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠం జగత్ప్రసిద్ధం. మనస్సు అనే పూజా పుష్పంతో

భగవంతుని పూజించాలి. సజ్జన సాంగత్యాన్ని అభిలషించాలి.దుర్జన సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. అహంకారం పతన హేతువు.

ఈ మూడు విషయాలు ప్రతివారూ ఎల్లప్పుడూ గుర్తించుకోవాలంటుంటారు ఆయన. కాగా ఆదిశంకరుల బోధనలపై

శ్రీశృంగేరి భారతీతీర్థ మహాస్వామి అనుగ్రహభాషణం వివరణ శంకర హృదయం లో చూద్దాం...

 

- నరసింహావతారం విశిష్టమైనది. భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని ప్రకటించిన అవతారం అది. ఆర్తత్రాణ పరాయణునిగా నారాయణునిడి

నిరూపించే అవతారం కూడా ఇదే. భక్తుని నమ్మకాన్ని నిరూపించిన భక్తపరాధీనుడు నరసింహుడు. ఇందుకు సంబంధించిన వివరణను

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన 'మమదేహి కరావలంబమ్'లో చూద్దాం. అలాగే... హరి భక్తుల తపము తపము. హరిభక్తి భవసాగరాన్ని

తేలికగా దాటిస్తుంది. హరి భక్తునిగా పుట్టినవాడు పావనుడు. కనుకనే కోరుకున్న చోట దైవం వెలిసేలా చేసుకోగలిగాడంటాడు ఎర్రాప్రగడ.

ఇందుకు సంబంధించిన వివరణను డా. యల్లాప్రగడ మల్లికార్జునరావు రాసిన 'నీయందు.. నాయందు కలడు కలడు' అనే వ్యాసంలో చూద్దాం.

 

- దుష్టాచారాలను నశింపజేయడానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆదిశంకరుల రూపంలో అవతరించాడు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి

అందించి మోక్షప్రాప్తికి మార్గం చూపిన మార్గదర్శకుడాయన. జీవిత కాలంలో నాలుగుసార్లు భారతదేశమంతటా ఆసేతు హిమాచలం పర్యటించారు.

అనేక క్షేత్రాలను దర్శించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకొనేందుకు ఐ.ఎల్.ఎన్. చంద్రశేఖరరావు రాసిన శివం శంకరంను చూద్దాం.

 

- స్తోత్ర సాహిత్యాన్ని లోకానికి పుష్కలంగా అందించారు ఆదిశంకరులు. సౌందర్యలహరి, శివానందలహరి వంటివెన్నో ఆయన రచించారు. అన్నింటిలో

అందరికీ తేలికగా అర్ధమయ్యేది భజగోవిందమే. భగవన్నామస్మరణతో భక్తిజ్ఞాన వైరాగ్యాలు కలిగేలా మొదటి శ్లోకంతోనే ప్రభావితం చేసే మంత్రదండం భజగోవిందం.

ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ రాసిన 'అద్వైత మకరందం భజగోవిందం'చూద్దాం..

 

- అలాగే గొల్లపల్లి వెంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠి రాసిన శ్రీ సత్యనారాయణ వ్రతం, చరణశ్రీ రాసిన చిన వెంకన్న కల్యాణం వంటి వారి వివరణలను,

ధర్మ సందేహాలు, మాసఫలం వంటివి చూడవచ్చు. వీటితో పాటు శ్రీసత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని చిరు పుస్తకంగా మీకు అందిస్తున్నాం...

Reviews

There are yet no reviews for this product.