Email

భక్తి పత్రిక డిసెంబర్ 2018

Availability : In Stock

భక్తిటివి కోటి దీపోత్సవం దిగ్విజయంగా పూర్తయింది. ప్రతిరోజూ లక్షలాది ప్రజలు దీపాలు వెలుగిస్తూ..ఉభయ తెలుగు రాష్ట్రాలను దీపజ్యోతిగా ప్రకాశింపజేశారు. ఈ దీపయజ్ఞం మున్ముందు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మా సంకల్పానికి తోడ్పాటు అందించిన వారికి.. ఉత్సవాన్ని జయప్రదం చేసిన అశేష భక్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్

పద్దెనిమిది అధ్యాయాల భగవగ్దీత హిందువులకు ఎంతో ఆచరణీయమైంది. మానవాళికి గీత సంప్రాప్తించిన శుభఘడియ గీతాజయంతి. ఈ నెల 18వ ఈ గొప్ప పర్వదినాన్ని జరుపుకుంటూ గీతావాక్కులను స్మరించుకుందాం. అదే రోజు వైకుంఠ ఏకాదశి కావడం మరో విశేషంగా చెప్పవచ్చు. డిసెంబర్ 16న ధనుర్మాసం ముగ్గులతో మన గుమ్మాలలో అడుగుపెడుతుంది. అలాగే ఆంజనేయ భక్తులు జరుపుకొనే హనుమద్ర్వతం ఈనెల 20న భక్తులు జరుపుకోనున్నారు. ఇంకా శ్రీ పద్మావతీదేవీ బ్రహ్మోత్సవాలు ఈనెల 3 అంకురార్పణ చేసుకొని తిరుచానూరిని ఉత్సవశోభతో అలరించనున్నాయి.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

_ ఈనెల 30న కొమురవెల్లి మల్లన్న పెళ్లికొడుకై పెళ్లిపీటలు అలంకరించనున్నాడు. అదేవిధంగా 40రోజుల పాటు భక్తి ప్రపత్తులతో, నిష్టానియమాలతో

అయ్యప్ప భక్తులు సాగించే మండల దీక్షా కాలమిది. వారి దీక్షలు ఫలవంతం కావాలని ఆకాంక్షిద్దాం.

 

_ వైదిక సంస్కృతికి, విజ్ఞానానికి మూలాలు వేదాలు. వాటిలో మొదటిది ఋగ్వేదం. వేద వాజ్ఞ్మయంలో ప్రధానమైనవి సూక్తాలు. ఋగ్వేదం దశమ మండలంలో ఉన్న

పురుష సూక్తం ఆ సూక్తాలన్నింటిలోనూ మొదటిది. శిరసు వంటిది. డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ రాసిన పరమాత్ముని ఉనికి.. పురుష సూక్తం వివరణ చూద్దాం.

 

_ ఏకాదశి మన పురాణ గాథల్లో ఒక దేవత పేరు. దశ ఇంద్రియాలను అదుపులో పెట్టగల శక్తి కలిగినది ముక్కోటి ఏకాదశి.

విష్ణువుకు ప్రీతికరమైన రోజు. డా. కాకునూరి సూర్యనారాయణ మూర్తి రాసిన ముక్కోటి ఏకాదశి వివరణ చూద్దాం.

 

_ సంప్రదాయంగా మనం అనుసరించే మాసాల్లో ధనుర్మాసం ఒకటి. ఇది దక్షిణయానానికి చివర.. ఉత్తరాయణానికి చివర వచ్చే పవిత్రమాసం. దైవాన్ని అర్చించుకొనే

అనువైన మాసంగా ధనుర్మాసానికి పేరుంది. మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసమిది. డా. యల్లాప్రగడ మల్లికార్జున రావు రాసిన దివ్యమాసం వ్యాసంలోని వివరణ చూద్దాం.

 

_ హనుమంతునికి సంబంధించి ముఖ్య పర్వదినాల్లో ముచ్చటగా మూడున్నాయి. మొదటిది వైశాఖ బహుళ దశమి నాడు వచ్చే హనుమజ్జయంతి.

రెండోది జ్యేష్ఠ శుద్ధ దశమి నాటి హనుమత్కల్యాణం. మూడోది మార్గశిర శుద్ధ త్రయోదశి నాటి హనుమద్ర్వతం. సకల కామ్యాలను తీర్చే హనుమద్ర్వతం ఏడాదికి

ఒక్కరోజు చొప్పున 13 సంవత్సరాలు చేసుకోవాల్సిన అరుదైన వ్రతం. ఈ వ్యాసాన్ని సకల సంపదలిచ్చే హనుమద్ర్వతం వివరణ చూద్దాం.

 

_ ఐఎల్ఎన్ చంద్రశేఖర్ రావు రాసిన మండల దీక్ష వ్యాసం, మల్లన్న జాతర, ఓ శాంతి ఓం కాంతి వంటి వ్యాసాలను చూడవచ్చు.

అంతేకాకుండా మాసఫలం, చెట్టు ఒక అద్భుతం వంటి వాటిని ఈ సంచిక ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ సంచికతో పాటు అయ్యప్ప మండలపూజ తరుణంలో శబరిమల క్షేత్రమహత్యం, విశేషాలతో కూర్చిన చిరు పుస్తకాన్ని పొందవచ్చు.

Reviews

There are yet no reviews for this product.