Email

భక్తి పత్రిక మార్చి 2019

Availability : In Stock

శివుడు ఆది దేవుడు. సృష్టి లయకారుడు. సర్వ జీవులకు ఆరాధ్యుడు. భక్తసులభుడు. ఆయనను సేవించుకునే మహాశివరాత్రి ఈనెల 4వ తేదీన రానుంది. ఉపవాసం, జాగారం, శివనామ స్మరణతో ఈ శివరాత్రి భళ్లున తెల్లవారుతుంది. ఫాల్గుణ మాసంలో నృసింహ దేవాలయాలన్నింటిలోనూ బ్రహ్మోత్సవ, వార్షిక కల్యాణోత్సవాలు జరుగుతాయి.

మార్చి 8 నుంచి 18వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దేశమంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకొనే పండుగ హోళీ 20వ తేదీన గాలిలో రంగవల్లులు ప్రదర్శిస్తుంది. ఆడామగా అన్న తేడా లేకుండా ఎంతో ఆత్మీయంగా ఈ పండుగను జరుపుకుంటారు.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

- 23న శ్రీవేములవాడ రాజన్న కళ్యాణం ఒక విశేషం. కదిరి, ధర్మపురి, అహోబిలం దేవుళ్లు కల్యాణ తిలకాలు,

బాషికాలు ధరించి ఈ తరుణంలో పెళ్లిపీటలపై దర్శనం ఇవ్వడానికి సిద్ధమౌతున్నారు.

 

- అన్నింటిలోనూ తానే ఉన్నవాడు.. జగమంతా తానే అయినవాడు శివుడు. యోగమూ శివుడే.. భోగమూ శివుడే.

ఆయనది ప్రధానంగా జ్ఞానదృష్టి. ఆయనకు ఎక్కువ తక్కువల పట్టింపు లేదు.

సమభావమే ఆయన మతం అంటూ 'శివమయం జగత్' లో రాసిన గరికపాటి నరసింహారావు వ్యాసాన్ని చూద్దాం.

 

- మహాశివరాత్రి నాడు లింగార్చన చేస్తాం. బంగారం, వెండి, రాగి వంటి లోహాలతో శివలింగాలను పూజిస్తాం.

పాదరసం వంటి వాటితో లింగార్చన చేస్తాం. అన్ని లింగాల కంటే పుట్టమన్నుతో చేసిన లింగం గొప్పదని మనవారు చెబుతారు

అంటూ లింగార్చన లో రాసిన సామవేదం షణ్ముఖ శర్మ వ్యాసాన్ని చూద్దాం.

 

- ఇంకా చాగంటి కోటేశ్వరరావు రాసిన హరహర మహాదేవ వ్యాసం, సద్గురు జగ్గీవాసుదేవ్ రాసిన గుండెనిండా శివుడు వ్యాసం,

శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ రాసిన అప్రమేయ శివరూపం వ్యాసం, గౌరీ ఉమేష్ రాసిన జ్యోతిర్లింగం వ్యాసం. డా. యల్లాప్రగడ మల్లికార్జున రావు

రాసిన శివమహాపురాణం వ్యాసం, ధూళిపాశ మహదేవమణి రాసిన శివావతారం వంటి వ్యాసాలు చూద్దాం.

 

- అలాగే డా. విద్వత్ శ్రీనిథి రాసిన రంగుల కేళీ హోళీ వ్యాసం, ఎర్రాప్రగడ రామకృష్ణ రాసిన నీముందే నేనుంటా వ్యాసం,

డా. కాకునూరి సూర్యనారాయణ మూర్తి రాసిన ఏకబిల్వం శివార్పణం వ్యాసం, సునీతా శేఖర్ రాసిన దైవ నిర్దేశం వ్యాసాలు కూడా ఉన్నాయి.

 

- అదేవిధంగా మార్చి నెల మాసఫలం, మహతి వంటివి.. శివరాత్రి పుణ్యమాసం కావడంతో అందరూ పఠించేందుకు

అనువుగా శివస్తుతిల్ని చిన్న పుస్తకంగా రూపొందించి ఈ సంచికతో ఉచితంగా అందిస్తున్నాం.

Reviews

There are yet no reviews for this product.