Email

భక్తి పత్రిక ఏప్రిల్ 2019

Availability : In Stock

చైత్రేమాసే జగద్బ్రహ్మా ససర్జ ప్రథమేహని
శుక్ల పక్షేసమగ్రంతు తథా సూర్యోదయే సతి

తాజాపూలు, తాజాపండ్లు పబాగా పండే ఈ వసంత వేళ నూతన ఉగాది మన గడపలకు మామిడి తోరణాలు కడుతుంది. ఏప్రిల్ 6న శ్రీ వికారి నామ సంవత్సరం వసంత సోయగాలతో ఆవిష్కృతమౌతుంది. నూతన పంచాంగాలు శ్రీవికారి ఫలితాలను రాశుల వారీగా విశద పరుస్తాయి. ఈ నూతన సంవత్సరం అందరికీ నిత్య కల్యాణం పచ్చ తోరణంగా నిత్యం సుఖశాంతుల పున్నములు పంచుతూ సాగాలని మనసా కోరుకుంటున్నాం.

అలాగే ఈ చైత్రంలోనే సీతారామ కల్యాణం వస్తుంది. శ్రీ సీతారాముల పేర్లు చెబితేనే భరతావని పులకించి పోతుంది. మన తెలుగు జాతి పరవశంతో పొంగిపోతుంది. ముఖ్యంగా తెలుగు నాట ఎందరో దేవుళ్లకి పెళ్లిళ్లు చేస్తారు గానీ.. సీతారాముల కల్యాణం మాత్రం ప్రత్యేకమైంది. ఆలయాలో.. ఊరూవాడలలో పది ఇళ్లు ఉన్న పల్లెల్లో కూడా రాములోరి పెళ్లి పందిళ్లు వెలస్తాయి. వడపప్పు..పానకాల మేళతాళాలతో సీతారాముల వారి కళ్యాణ శోభ వెలిగిపోతుంది.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

- ఈనెల 14, 18 తేదీలలో భద్రాద్రి ఒంటిమిట్ట రామాలయాల్లో నేత్రపర్వంగా శ్రీరామ కళ్యాణోత్సవాలు జరగనున్నాయి.

ఇక్కడ నుంచే కొత్త ఏడాదిలో పెళ్లి పందిళ్లు శ్రీకారం చుట్టుకొని మన గడపలు పెళ్లికళ సంతరించుకుంటాయి.

 

- ఉగాది అంటే ప్రకృతి పుట్టినరోజు. చైత్రమాసంలోని శుక్ల పక్షంలో మొదటి రోజును బ్రహ్మదేవుడు సృష్టికి శ్రీకారం చుట్టాడంటారు.

ఉగాదితోనే ఏడాది పూర్తయి ప్రకృతిలో మార్పుల చక్రం మళ్లీ మొదటికి వస్తుంది. తొలి రుతువైన వసంతం మళ్లీ వస్తుంది. వసంత సంకేతంగా

ఉగాదిని మానవాభ్యుదయానికి శ్రీకారంగా నిర్వహించుకుంటాం అని డా. దేవులపల్లి పద్మజ రాసిన'శుభ ఉగాది' వివరణ చూద్దాం.

 

- కొత్త సంవత్సరం ప్రారంభాన్ని ఉగాది సూచిస్తుంది. శుభ నిరీక్షణకు సంకేతంగా ఉగాది నిలుస్తోంది. ఉగాది రోజు ప్రకృతి మొదలు ప్రజానీకం వరకు అన్నింటా

నూతనత్వమే కనిపిస్తుంది. చెట్లు చిగురిస్తాయి. పక్షులు రాగాలు తీస్తాయి. గ్రహగమనాలు కొత్త దోవకు మరలుతాయి. ఎన్నో వైవిధ్యాలను తనలో నింపుకున్న

ఉగాది పండుగలో ప్రాంతాల వారీగా అనేక ఆచారభేదాలు కనిపిస్తాయి అంటూ డా. కప్పగంతుల రామకృష్ణ రాసిన'అందరి పండుగయా ఉగాది'వివరణ చూద్దాం.

 

- శ్రీరాముని గురించి మాట్లాడుకోవడం అంటే మన గురించి మనం మాట్లాడుకోవడమే. ధర్మాన్ని పాటించిన మానవుడు అసాధ్యాలను సుసాధ్యం

చేయగలడని రాముడు నిరూపించాడు. నిజమైన మానవుడు ఎలా బ్రతకాలో అలా బ్రతికి చూపించాడు. కొత్త ఏడాది ప్రారంభంలో రామాయణాన్ని

తప్పనిసరిగా వినాలి అంటూ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి అనుగ్రహ భాషణం నుంచి ' రామాయణ గాథ.. వినుడీ మనసారా' వివరణ చూద్దాం.

 

- శ్రీరామనవమి రాముని పుట్టినరోజు అయితే ఆరోజే శీతారామ కళ్యాణం ఎందుకు చేస్తున్నాం? మన పెద్దలు ఇలాంటి సంప్రదాయాన్ని ఎందుకు పెట్టారు?

పోనీ ఆయన పుట్టిన రోజు పెళ్లి రోజు రెండూ ఒకరోజున అయ్యిందేమో అనుకుందాం అంటే ఆ విధమైన దాఖలాలు రామాయణంలో ఎక్కడా కనబడట్లేదు.

మరి ఈ సంప్రదాయం మనకెలా వచ్చింది? వంటి విషయాలతో బ్రహ్మ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి రాసిన 'శ్రీరామ కల్యాణం' వివరణ చూద్దాం.

 

- రామ అని పరబ్రహ్మమునకు పేరు. రామ అనే రెండక్షరాలు తారకమంత్రం అన్నమాట యజుర్వేదం చెప్పింది. తారకం అంటే తరింపజేసేది.

సారం అని అర్థం. రామ మంత్రాన్ని'తార తారతర తారక మంత్రం' గా వేదం అభివర్ణించింది. పంచాక్షరీ, అష్టాక్షరీ మహామంత్రాలలోని జీవాక్షరాల

సంపుటి రామనామం అంటూ సామవేదం షణ్ముఖశర్మ రాసిన 'ధర్మ స్వరూపుడు'వివరణ చూద్దాం.

 

- ఇంకా డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్ రాసిన అపద్బాంధవుడు వివరణ, డా. ధూళిపాశ మహాదేవమణి రాసిన అందాల రాముడు..

అందువలన దేవుడు వివరణ, డా. కావూరి రాజేశ్ పటేల్ రాసిన సిరి కల్యాణపు బొట్టును పెట్టీ.. వివరణ,ఎర్రాప్రెగడ రామకృష్ణ రాసిన

ఓ రామ నీనామ మెంతో రుచిరా.. వంటి ఎన్నో వ్యాసాలు సవివరంగా చూడవచ్చు.

 

- అదేవిధంగా లింగంపల్లి అప్పారావు రాసిన శ్రీరామరాజ్యం వివరణ, ఆధ్యాత్మిక దీపంతో పుస్తక పరిచయాలు, డా. రావేరా వారి ఏప్రిల్ మాసఫలం

వంటివి చూడవచ్చు. అంతేకాకుండా శ్రీవికారి రాశిఫలాలు 2019- 2020 ఓ చిరుపుస్తకంతో అనుబంధంగా ఇవ్వబడింది.. ఉచితంగా పొందవచ్చు.

 

- శ్రీవికారి నూతన సంవత్సరం అందరికీ శుభాలను.. సుఖ సంతోషాలను ఇవ్వాలని మనసారా కోరుకుంటూ..

Reviews

There are yet no reviews for this product.