Email

భక్తి పత్రిక డిసెంబర్ 2019

Availability : In Stock

“భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిః నమోస్తుతే“

కార్తికం భక్తి తత్పరత కి చిహ్నంగా ముంగిళ్ల ముందు సంధ్యాదీపమై వెలుగుతుంది. పెరటి, తులసికోట దివ్వెల కాంతులతో పచ్చలు పూయిస్తుంది. దీపకాంతి తోరణంగా ఎనిమిదేళ్లనాడు శ్రీకారం చుట్టుకున్న భక్తిటీవీ కోటి దీపోత్సవం ఏటికేడాది త్రివిక్రమించి దేశమంతా ఆక్రమించింది. తిరుగులేని వార్షిక ఆనవాయితీగా మారింది. గత నవంబర్ నెలలో భక్తిటీవీ ఎనిమిదో కోటి దీపోత్సవం 3 నుంచి 18 దాకా పదహారు రోజుల పాటు జంటనగరాల వారికే కాదు, సరిహద్దు జిల్లా వాసులకి సైతం వెలుగుల పండుగలా గడిచింది. వారి దర్శనమే అపురూపంగా భావించే మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేసి పునీతం చేశారు. దివ్యమంగళాశాసనాలు, హితవచనాలతో లక్షలాదిమంది ప్రజానీకాన్ని తాత్విక చైతన్యంలో ముంచెత్తారు. ఆడబోయిన తీర్థాలు ఎదురైన తీరున పలు దైవక్షేత్రాల నుంచి విచ్చేసిన ఉత్సవమూర్తులు భక్తిటీవీ సర్వాంగ సుందరంగా, అపరకైలాసంగా సమకూర్చిన వేదికపై శాస్త్రోక్తంగా అర్చక స్వాములతో వివాహ వేడుకలు జరిపించుకున్నారు.

నిత్యం జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులు, ఉన్నత అధికారులు భక్తిప్రపత్తులతో కార్యక్రమానికి వచ్చి పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. భక్తిటీవీ కోటిదీపోత్సవ కార్యక్రమాన్ని మహాయజ్ఞంగా, అరుదైన సందర్భంగా అభివర్ణించి, మనసా అభినందించారు. అనంతరం నిత్యం సాగే స్వర్ణలింగోద్భవం, సప్తహారతులు ఒక విలక్షణ సన్నివేశంగా నిలిచాయి. అనేక జానపద కళా ప్రదర్శనలు, మహిళామణుల కోలాట ప్రదర్శనలు ప్రాంగణానికి నవ్యకాంతులు అద్దాయి. ఈ దీపమహాయజ్ఞ కార్యక్రమానికి తోడునీడగా నిలిచిన భక్తకోటికి వందనాలు. కోటి దివ్వెలకు అండగా ఉన్న ప్రకృతికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. డిసెంబర్ మాసంలో గీతాజయంతి, హనుమద్వ్రతం రానున్నాయి. 16న ధనుర్మాసం ముంగిట ముగ్గులతో వర్ణవైభవంతో మొదలవుతోంది. సస్యలక్ష్మిని వెంటతెచ్చే సిరుల మాసానికి స్వాగతం.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

➠ భగవద్గీత మతగ్రంథం కాదు. ఇది మనిషికి స్వస్వరూప జ్ఞానాన్ని అందిస్తుంది. భగవంతుని స్వరూపాన్ని విశ్లేషించి చెబుతుంది. వివిధ స్థాయిల్లో

ఉన్న వ్యక్తులకి వివిధ రీతుల్లోసాధనల్ని చెబుతుంది. అనేకమైన ఆధునిక విమర్శలకి కూడా సమాధానాలు దీనిలోనే లభిస్తాయి.

 

➠ విష్ణుభక్తులకు ధనుర్మాసం పవిత్రమైనది. ఆండాళ్ పాశురాలతో దేవదేవుణ్ణి మేలుకొల్పుతారు. ఈ నెల్లాళ్లూ తెల్లవారకముందే

ఇళ్ల ముంగిళ్లలో అందమైన ముగ్గులు దర్శనమిస్తాయి. నియమాలతో కూడిన వివిధ నైవేద్యాలు స్వామికి సమర్పిస్తూ ఉంటారు.

ధనుర్మాస వ్రతనిష్ఠతో విష్ణులోకప్రాప్తి కలుగుతుంది.

 

➠ శ్రీకాళహస్తిలో ఏడుగంగల జాతర ప్రతి ఏడాది కోలాహలంగా జరుగుతుంది. ఏడు ప్రధాన వీధులలో ఏడు గంగలు కొలువు దీరుతాయి.

ప్రతి ఇంటిలోనూ పోలేరమ్మ కొలువు తీరుతుంది. కుంభాలలో వెలిగించిన దీపాలతో ముత్తయిదువులు గంగమ్మల వద్ద మొక్కులు తీర్చుకుంటారు.

 

➠ శ్రీ కాలభైరవస్వామి ఆవిర్భవించిన పవిత్రదినం మార్గశిర బహుళ అష్టమి. దీనినే కాలభైరవాష్టమి అని వ్యవహరిస్తారు.

కాలభైరవుని ప్రస్తావన లేని శివపురాణాలు, గాథలు లేవని చెప్పవచ్చు.

 

➠ హనుమంతుడు కేవలం దేవతామూర్తి కాదు. మంత్రమూర్తి. యోగస్వరూపుడు. హనుమత్ ఉపాసనలో గొప్ప ఫలితాలను అనుగ్రహించే

హనుమద్వ్రతాన్ని పరాశర సంహిత చెప్పింది. సకల హితాలనూ చేకూర్చే హనుమద్వ్రత సందర్భం ఆయన భక్తులకు ముఖ్యమైనది.

 

➠ తెలుగునాట సుబ్బరాయ షష్ఠి భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. లోక కల్యాణంకోసం జన్మించిన కుమారస్వామికి దేవసేనతో కల్యాణం

జరిగిన తిథి సుబ్బరాయ షష్ఠి. అందుకే ఈ పర్వం కల్యాణకారకం. ఈ పండుగనాడు సుబ్రహ్మణ్యుని అర్చిస్తే చక్కని సంతానం కలుగుతుందంటారు.

 

➠ తిరువారూరులో జన్మించినవారు, కాశీలో మరణించినవారు మోక్షానికి అర్హులవుతారు. అరుణాచలం అని ఊరుపేరు మాత్రం తలిస్తే చాలు...

మోక్షార్హత లభిస్తుందన్నాడు. అరుణగిరిపై కార్తిక దీపాన్ని దర్శిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.

 

➠ అయ్యప్ప దీక్షలు, యాత్రపై చిరుపుస్తకం స్వామియే శరణం అయ్యప్ప ఈ నెల భక్తి పత్రికతో పాటు అందుకోండి.

Reviews

There are yet no reviews for this product.