తెలంగాణ గడ్డపై దాదాపు నెలరోజుల పాటు భక్తిశ్రద్ధలతో జులై 4వ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే భోనాలు ప్రారంభమయ్యాయి... అమ్మ బైలెల్లినాదో అంటూ సాగే ఆడపడుచుల బోనాల సమర్పణోత్సవం, వీధివీధికి భక్తి తోరణం కడుతుంది. ఒక బోనాలకు కాపాలాగా నడిచే పోతరాజుల విన్యాసాలు ఈ బోనాల ఉత్సవాలకు ఎంతో శోభనిస్తాయి. దేశాన్ని తాత్త్విక చైతన్యంతో ఉత్తేజపరిచిన స్వామి వివేకానందుని వర్థంతి ఈ నెలలోనే రానుంది. ఇక గురుపూర్ణిమ రోజు మన గురుపరంపరను సంస్మరిస్తూ వారికి అంజలి ఘటించడం మన సంస్కారం. గురుపూర్ణిమ రోజు మహనీయులు, మాన్యులైన పీఠాధిపతులు ప్రారంభించే చాతుర్మాస్య దీక్షలు ప్రశాంతంగా సాగాలని కోరుకుందాం.

➠ శాక్తేయులకు పవిత్రమైన ఆషాఢ మాసంలో గ్రామదేవతలందరికీ నైవేద్యాలు సమర్పిస్తారు.. ఇతే తెలంగాణలో బోనాలుగా వ్యవహారంలోకి వచ్చింది.. డాక్టర్ కె. విద్వత్ శ్రీనిధి మాటల్లో "ఆషాఢ జాతర'' విశేషాలను తెలుసుకుందాం..

➠ ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మహోత్సవం నిర్వహిస్తారు.. సెలబ్రిటీల మొదలు, సామాన్య ప్రజల వరకు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు.. ఆ అమ్మవారి గురించి ''ఎల్లమ్మ తల్లి కల్యాణం'లో చూద్దాం...

➠ రెండున్నర అడుగుల ఎత్తుతో ఎడమ చేతితో కవ్వం, కుడిచేతిలో కవ్వపుతాడు ధరించి కనిపించే నవనీత చోరుడు ఉడుపి శ్రీకృష్ణుడి గురించి శ్రుతి దామోదర్ "నవనీత చోరునికి.. బంగారు గోపురం''లో వివరంగా తెలుసుకుందాం..

➠ వీటితోపాటు తొలి ఏకాదశి, గురు కటాక్షం, సింహగిరి పున్నమి, సర్వం జగన్నాథం, సమర్థ సద్గురు, గజేంద్ర మోక్షం, ఆదిగురువుతోపాటు.. పలు శీర్షికలు కూడా ఉన్నాయి. 

➠ ఇక ఈసారి భక్తి మాసపత్రికతో... తెలుగింటి గృహిణుల కోసం ఆరోగ్య, ఐశ్వర్య ప్రదాయినిగా రూపొందించిన 'ఇల్లాలి సౌభాగ్యం'' చిరు పుస్తకాన్ని అనుబంధంగా అందిస్తున్నాం...

Recent Comments