సుస్థితం దుస్థితం వాపి శివలింగం నచాలయేత్
శతేన స్థాపయేత్ లింగం సహస్రేణతు చాలయేత్
ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించాలంటే వందమంది పూనుకుంటే చాలు. జీర్ణోద్ధరణకు మాత్రం వెయ్యి మంది సాక్ష్యం కావాలంటున్నాయి ఆగమాలు. అంటే ఆలయాల పునరుద్ధరణకు సమాజంలో అందరూ పూనుకోవాలని అంతరార్థం. జీర్ణదశలో ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా పూజలు జరిగే ఆలయంలో ఉన్నది సుస్థిత లింగం. ఆలయం చక్కగా ఉన్నా ధూపదీప నైవేద్యాలకు సైతం నోచుకోనిది దుస్థిత లింగం. రెండు తరహాల ఆలయాలనూ కాపాడుకోవడం మన కర్తవ్యం. నూతన ఆలయాల నిర్మాణం కంటే ఆలయాల జీర్ణోద్ధరణ రెండురెట్లు అధిక పుణ్యఫలాలనిస్తుంది. ఆదిశంకరుని వంటి యతీశ్వరులు, వ్యాసరాయల వంటి రాజగురువులు జీర్ణోద్ధరణకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. ఘనచరిత్ర కలిగి, అద్భుత శిల్పకళా సంపదకు నెలవై, పురాణ ప్రశస్తి కలిగిన ఎన్నో ఆలయాలు నేడు ధూపదీపాలకు సైతం నోచుకోని దుస్థితిలో ఉన్నాయి. ఈ పరిస్థితి చక్కబడాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. మన వారసత్వ సంపద అయిన ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మాత్రమే పరిగణించే దుస్థితి మారాలి. పాలకమండళ్లను బలోపేతం చేయాలి. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి. భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యం కల్పించాలి. అదే సమయంలో పౌరులందరికీ ఆలయ సంస్కృతి - చరిత్రలపై అవగాహన పెంచే కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలి. ఆ మహా కార్యశూరుని నుంచి స్ఫూర్తి పొందుదాం. కర్తవ్యాలను పాటిద్దాం.
➠ ఆధ్యాత్మిక సాధన, సేవ మార్గాలద్వారా ధర్మమార్గాన్ని ఉపదేశిస్తున్న నవయుగ సిద్ధ దత్తయోగి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి. ఆయన నెలకొల్పిన అవధూత దత్తపీఠం సమాజంలో ఆధ్యాత్మిక జీవన వికాసానికి కృషి చేస్తోంది. నాదచికిత్సతో శారీరక, మానసిక రోగాలకు రక్షణ కల్పించే వైద్యశిఖామణి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి. మే 26వ తేదీ ఆయన జన్మదినం.
➠ నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తూ ముల్లోకాల్లో సంచరించే భాగవతోత్తముడు నారద మహర్షి. లోక కల్యాణం కోసం కలహాలు కల్పిస్తూ కలహ భోజనుడు అనిపించుకున్న మహర్షి ఆయన. నారం దదాతీతి నారదః. తన మాటలు, చేతలతో జ్ఞాన సంపదను పంచిపెడతాడు నారదుడు. లోకానికి ధర్మాన్ని, భక్తిని ఉపదేశించడం తన కర్తవ్యంగా భావిస్తాడు.
➠ తిరుపతి దివ్యక్షేత్రానికి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ. తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను దర్శించుకునే ఆనవాయితీ ఉంది. ప్రతి సంవత్సరం తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. గంగమ్మ జాతర విశేషాలు.
➠ చాంద్రమానంలో కూడా ఒకే నెలలో రెండు పున్నములు వస్తే దానినే అధికమాసం అంటారు. విళంబి నామ సంవత్సరంలో జ్యేష్ఠమాసం అధికమాసంగా వచ్చింది. పురుషోత్తమమాసంగా పేరున్న అధికమాసంలో చేసిన పుణ్యకార్యాలకు అధిక ఫలితాలు సిద్ధిస్తాయంటారు.
➠ రుద్రాంశ సంభూతుడు... పరమ వైష్ణవ భక్తశిఖామణి ఆంజనేయుడు. కోరినవారికి కోరిన రూపాన దర్శనమిస్తాడు. తలచినవారికి తలపులలోని అభీష్టాలను సిద్ధింపచేస్తాడు. ఆర్తితో పిలిచేవారికి ఆపన్నహస్తం అందించే సులభసాధ్యుడైన దైవం ఆంజనేయస్వామి. భక్తుడు, భగవంతుడు ఒక్కటయ్యే మార్గానికి వారధి హనుమ.
➠ ప్రతి ఏటా వైశాఖమాసంలో పాడేరులోని మోదకొండమ్మ దేవత ఆలయం జాతరకు సిద్ధమవుతుంది. ఈ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహిస్తోంది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుతెచ్చుకుంది. మూడురోజుల పాటు నిర్వహించే మోదకొండమ్మ జాతరలో ఎన్నెన్నో విశేషాలున్నాయి.