దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే

కార్తికంలో వెలిగించే సంధ్యాదీపం మనలోని అజ్ఞానపు చీకట్లనుపోగొడుతుంది. ఇళ్లలో, ఆలయాల్లో, దీపోత్సవాల్లో ఒక్క దీపాన్ని వెలిగించినాచాలు అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. కార్తిక దీపారాధనతో మోక్షాన్ని పొందిన భక్తుల కథలెన్నింటినో మన పురాణాలు వర్ణించాయి. స్వయంగా వెలిగించక పోయినా, మరొకరు వెలిగించిన దీపాన్ని కాపాడినా మంచిదేనని పండితులు చెబుతారు. కార్తికం హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమే అయినా, శివారాధన ప్రత్యేకంగా చేస్తారు. ఒక్క సోమవారం నాడైనా నక్షత్ర దర్శనం వరకు శివారాధనలో గడిపి, భుజించ గలిగితే చాలు. హరోంహర శంకరా అంటూ ఈ నెలరోజుల్లో ఒక్కరోజైనా పుణ్య నదుల్లో మునకవేస్తే చాలు. సమస్త తీర్థాలు, క్షేత్రాలు సేవించిన ఫలం... సాధుసత్పురుషులను దర్శించిన ఫలం అన్నింటినీ మనకు కార్తికమే అందిస్తుంది. 

కార్తికంలో ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలో కోటిదీపోత్సవాన్ని భక్తిటీవీ ఒక సత్సంప్రదాయంగా నిర్వహిస్తోంది. 2012లో ప్రారంభించిన దీపోత్సవం తెలుగువారికి అభిమాన కార్యక్రమంగా రూపుదాల్చడం మాకు మహాదేవుడు అందించిన వరంగా భావిస్తున్నాం. వివిధ క్షేత్రాలనుంచి ఉత్సవ మూర్తులను వేదికపైకి తీసుకువచ్చి కల్యాణాలు నిర్వహిస్తున్నాం. సత్పురుషుల సన్నిధిలో కోటిదీపాలు ఒకే ప్రాంగణంలో వెలిగేలా చేస్తున్నాం. మహాదేవునికి నృత్య, గీత నీరాజనాలు సమర్పిస్తున్నాం. ఇటువంటి వేడుక న భూతో న భవిష్యతి అన్నంతగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది. దీనివెనుక అశేష భక్తజనుల దీవెనలున్నాయి. ఈ ఏడాది కూడా.... అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మీ అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం.

➠ మనోభీష్టాలను సిద్ధింపచేసే విశేష పూజలు, వాహన సేవలు. దేవీ దేవతల కల్యాణోత్సవాలు, సాంస్కృతిక సౌరభాలు. జగద్గురువుల దర్శనం, పీఠాధిపతుల ఆశీర్వచనం. అతిరథుల సమక్షంలో మహాదీపయజ్ఞం అద్భుతం... అనిర్వచనీయం అపూర్వం... అనితర సాధ్యం ఆద్యంతం ఆద్యాత్మికం అణువణువునా భక్తిభావం దీపాల వెలుగుల్లో పాపసంహారం మార్మోగే శివనామ స్మరణం కైలాసనాథుని ఆనంద తాండవం సప్త హారతుల వైభవం దిగివచ్చిన కైలాసం కదలివచ్చిన వైకుంఠం మదిమదిలో నిలిచే వెలుగుల పర్వం భక్తిటివి కోటిదీపోత్సవం.

➠ కార్తిక పౌర్ణమికి అన్నవరంలో సత్యనారాయణ స్వామి వెలసిన రత్నగిరికి భక్తులు ప్రదక్షిణ చేస్తుంటారు. అనేక తపోమార్గాలలో భూప్రదక్షిణం అనేది ఒక విశిష్ట మార్గం. కొన్ని ముఖ్య సందర్భాలలో గిరిప్రదక్షిణ, గోప్రదక్షిణ చేయడం ద్వారా భూ ప్రదక్షిణ ఫలాలను పొందవచ్చు. అటువంటి గొప్ప అవకాశమే రత్నగిరి ప్రదక్షిణతో లభిస్తుంది.

➠ తిరుచానూరులో వెలిసిన శ్రీపద్మావతీ అమ్మవారికి కార్తికమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అమ్మవారి జన్మతిథి అయిన కార్తిక బహుళ పంచమి నాడు పంచమీతీర్థంతో ఈ ఉత్సవాలు పూర్తవుతాయి. విశ్వనాయకి, జగన్మాత అయిన అలమేలు మంగమ్మకూ శ్రీవారి వలెనే అన్ని కైంకర్యాలూ, వాహనసేవలూ నేత్రపర్వంగా నిర్వహిస్తారు.
 

➠ శివ, కేశవులిద్దరికీ ప్రీతి పాత్రమైన కార్తికమాసంలో అత్యంత విశేషమైన ఫలితాలనిచ్చే పర్వదినం క్షీరాబ్దిద్వాదశి. కార్తిక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ధిద్వాదశిగా నిర్వహించుకుంటారు. క్షీరసాగర మధనం ముగిసిన రోజిది. వాడుక భాషలో మధించడం అంటే చిలకడం కాబట్టిచిలుకు ద్వాదశి అనే పేరు కూడా వ్యాప్తిలోకి వచ్చింది. ఆనాడే తులసీ దామోదర పూజ నిర్వహిస్తారు. క్షీరాబ్ధిద్వాదశి మహిమ అపారం.

➠ అరటిదొప్పలో వెలుగుతున్న దీపాన్ని ప్రవహించే నీటిలో విడిచిపెట్టే పర్వం తెలుగు మహిళలు ఆచరించే పోలిస్వర్గ దీపం. మార్గశిర శుద్ధ పాడ్యమి నాటి తెల్లవారుజామున నదీతీరాలన్నీ పుణ్యస్నానాలు ఆచరించే, దీపాలు విడిచే మహిళామణులతో నిండిపోతాయి. పోలిస్వర్గ దీపం వ్రతం వెనుక ఆసక్తిదాయకమైన అంశాలు దాగి ఉన్నాయి.

➠ తెలుగునాట సుబ్బరాయ షష్ఠి కుమారస్వామి పరంగా జరుపుకునేపండుగ. లోక కల్యాణంకోసం జన్మించిన కుమారస్వామికి దేవసేనతో కల్యాణం జరిగిన తిథి సుబ్బరాయ షష్ఠి. అందుకే ఈ పర్వం కల్యాణకారకం. ఈ పండుగనాడు సుబ్రహ్మణ్యుని అర్చిస్తే చక్కని సంతానం కలుగుతుందంటారు.

Recent Comments