ఏ మహానుభావుని రాకతో నిత్యం మనకు పొద్దు పొడుస్తుందో.. చెట్లు చిగురిస్తాయో... పూలు రెక్కలు విప్పుతాయో ఆ సూర్య దేవునికి నమస్కారం. విశ్వమంతా కాంతులు పొంగుతాయి. ప్రతి సూర్యోదయం ఒక నూతన సృష్టి. చైతన్య స్రవంతి. ప్రత్యక్ష నారాయణుడు అయిన ఆదిత్యుడు ఈ మాసంలో అంటే 12న వస్తున్న రథసప్తమి సూర్యారాధన పర్వదినం. మన దక్షిణాదిన భక్తకవులు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వారి సేవ అజరామరం. ఈ నెల 4,5 తేదీలలో భక్త పురందరదాసు జయంతి, భక్త రామదాసు జయంతి ఉన్నాయి. అలాగే పలుకులమ్మని కొలుచుకొనే వసంతపంచమి ఈనెల 10వ తేదీన వస్తున్నాయి. ఇంకా వాసవీకన్యక ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని నిలుపుకోవడానికి రాజరికాన్ని ధిక్కరించిన ధీరవనిత. అందుకే ఆమెను దైవాంశ సంభూతురాలుగా ఆలయాల్లో పూజిస్తారు. ఫిబ్రవరి 6న ఆమెను భక్తిపూర్వకంగా స్మరించుకుంటాం. కంచికామకోటి పూర్వపీఠాధిపతి శ్రీజయేంద్రసరస్వతి తొలి ఆరాధనోత్సవం ఈనెల 18వ తేదీన వస్తుంది. అలాగే... ఫిబ్రవరి నెలాఖరులో శ్రీశైలం, శ్రీకాళహస్తీశ్వర సహా ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమౌతున్నాయి.  

➠ సృష్టిని దర్శింపజేసే దివ్గదీపం సూర్యుడు. ఎత్తున దీపం పెడీతే చుట్టూ అంతటా స్పష్టంగా అవుపిస్తుంది. సూర్యుడు పైన నింగిలో అలాగే ప్రతిష్ఠితుడయ్యాడు. విశ్వరూప భగవానుని కన్ను ఆయనే అంటూ డా. మంజులూరి నరసింహారావు రాసిన ప్రత్యక్ష దైవం వివరణ చూద్దాం. 
 
➠ రథ సప్తమి నుంచి సూర్యరథ వేగం తగ్గుతూ వేడిమి పెరుగుతుంది. పగటి కాసము, ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. రథసప్తమినాడే సూర్య జయంతిగా మనవారు ఆచరిస్తారు. జిల్లేడు ఆకులు, రేగుపళ్లను శిరస్సున ఉంచుకొని స్నానం చేస్తారు. చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకుల్లో సూర్యునికి పాయసం నివేదిస్తారు అంటూ హరి ఫణిరాజదత్త రాసిన మహిమాన్వితం రథసప్తమి వివరణ చూద్దాం. 

➠ మాఘంలో సూర్యరథాలు నిలబడతాయి. వైశాఖంలో మార్తాండుడు సెగలు పుట్టిస్తాడు. శ్రావణ భాద్రపదాల్లో మబ్బు ముసుర్ల మధ్య అస్పష్టంగా గోచరిస్తాడు. మార్గశిరంలో గోరువెచ్చని సూర్యస్పర్శ కోసం జీవులు తహతహలాడతాయి. పుష్యమాసంలో మంచుతెరల మధ్య సూర్యోదయం కోసం నిరీక్షించడం అద్భుతంగా ఉంటుంది అంటూ డా. కడిమిళ్ల వరప్రసాద్ రాసిన నెలకొక్క పేరు వివరణ చూద్దాం. 

➠ అలాగే... డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్ రాసిన ఆదిత్య హృదయం వివరణ, డా. కప్పగంతు రామకృష్ణ రాసిన సూర్యరశ్మి ప్రాణశక్తి వివరణ, కావూరి రాజేశ్ పటేల్ రాసిన ఆరోగ్య భాస్కరుడు వివరణ, ఐఎల్ఎన్ చంద్రశేఖర్ రావు రాసిన లోక బాంధవుడు వివరణ, ధర్మప్రియ రాసిన వసంతపంచమి వివరణ కూడా చూడవచ్చు. 

➠ ఇంకా ధూళిపాళ మహదేవమణి రాసిన భీష్మఏకాదశి వివరణ, సునీతా శేఖర్ రాసిన సంకల్ప శక్తి, శ్రుతి దామోదర్ రాసిన మధ్వనవమి వంటి వ్యాసాలు కూడా చూడవచ్చు. అదేవిధంగా ధర్మసందేహాలు, మాసఫలం వంటివి ఉన్నాయి. 
 
➠ మాఘం పూర్తిగా పెళ్లిళ్ల మాసం కావడంతో మన తెలుగు వారి పెళ్లి తంతును సంక్షిప్తంగా తెలియజెప్పే పెళ్లి పుస్తకాన్ని ఈ సంచికతో పాటు మీకు అందిస్తున్నాం.

Recent Comments