యదవ్యక్తాత్మకో విష్ణుః కాలరూపో జనార్దనః
తస్యాంగాని నిబోధత్వం క్రమాన్మేషాదిరాశయః

అవ్యక్తాత్మకుడైన భగవంతుని అసలు స్వరూపం కాలం. అది అనంతం... అగమ్యగోచరం. కానీ అదే సత్యం. కాలాన్ని అనుసరించే మంచి చెడులుంటాయి. ఒక కాలంలో మంచి అనుకున్నది మరోకాలంలో చెడుగా పరిణమించవచ్చు. ఒకకాలంలో మనం చెడ్డదేమో అని విడిచిపెట్టినదే ఇప్పుడు మంచిదై అందరి మన్ననలూ పొందవచ్చు. కాలం అనివార్యంగా తీసుకువచ్చే మార్పులను అంగీకరించడంలో వెనకడుగు వేయకూడదు. 2019 కొత్త సంవత్సరం ప్రవేశం మనలో పురోగామి మార్పులకు పునాది కావాలి. ఏడాదికాలంలో కొన్ని రోజులను పుణ్యకాలాలుగా మన ధార్మికులు పేర్కొంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం అటువంటిదే. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంతో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం భౌగోళికంగా కీలకమైనది. ఆ తరుణాన్ని అందరూ గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే, మనలో ధర్మాచరణ పట్ల ఆసక్తి కలిగించే సదాశయంతోనే మనవారు పండుగలను ఏర్పాటు చేశారు. భోగి పండుగ గడపగడపకీ సంక్రాంతి శోభను తీసుకువస్తుంది. కనుమ, ముక్కనుమలతో కలిపి సంక్రాంతి నాలుగురోజుల పండుగ. కాలగతిలో ముక్కనుమకు ప్రాధాన్యం తగ్గింది. భోగి, సంక్రాంతులు ధార్మిక కార్యక్రమాలకు, కనుమ పండుగ విందువినోదాలకు పేరుపడ్డాయి. సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ. ఈ పండుగ మీ ఇంట ఆనందాల సిరులు కురిపించాలని ఆకాంక్షిస్తున్నాం. అలాగే పన్నెండు రాశుల వారికీ సంవత్సర ఫలాలను జ్యోతిష పండితులు గుణించి చెప్పిన వాటిని చిన్నపుస్తకంగా అందిస్తున్నాం. ఈ నూతన సంవత్సర ఫలితాలు అందరికీ శుభసంతోషాలను ఇవ్వాలని కోరుకుంటూ...

➠ తమిళనాడు రాష్ట్రం వేలూరు వద్ద ఉన్న శ్రీపురం స్వర్ణ దేవాలయాన్ని దర్శించిన వారికి ఇటువంటి అనుభూతే కలుగుతుంది. ఈ నక్షత్రాకారపు దివ్య భవ్య ఆలయాన్ని నిర్మించింది సాక్షాత్తు శక్తి రూపంగా భక్తులు భావించే శక్తి అమ్మన్. ఇక్కడ దర్శనం ఇచ్చే శ్రీమహాలక్ష్మీ నారాయణీ అమ్మన్ ఆలయం భక్తులకు అత్యంత విలువైన ఆధ్యాత్మిక అనుభూతుల్ని పంచుతుంది.

➠ ధనుర్మాసమంతా వైష్ణవాలయాల్లో తిరుప్పావై గానం చేస్తారు. తిరు అంటే శ్రేష్టమైన అనీ, పావై అంటే వ్రతమనీ అర్థం. తిరుప్పావై ప్రాచీన తమిళ కవితా పద్ధతికి చెందిన కావ్యం. ముప్పై పాశురాలతో కూడిన దీన్ని గోదాదేవి రచించింది. ఆమెకే ఆండాళ్ అని పేరు. భూదేవి రూపంగా ప్రసిద్ధి చెందిన ఆండాళ్ పన్నెండు మంది వైష్ణవ ఆళ్వార్లలో ఒకరు. ఆమె అవతరించిన మహాపుణ్యక్షేత్రం శ్రీ విల్లిపుత్తూరు. గోదాదేవిని భూదేవి అంశగా వైష్ణవులు భావిస్తారు.

➠ అజ్ఞానానికి, దారిద్ర్యానికి, దుఃఖానికి ప్రతీక అయిన చీకటిని పారద్రోలి జ్ఞానానికి, ఐశ్వర్యానికి, ఆనందానికి ప్రతీక అయిన దీపస్వరూపునిగా హరిహర సుతుడు అయ్యప్పను ఆరాధించడం సంప్రదాయం. దీపం అంటే జ్యోతి. అయ్యప్ప జ్యోతి స్వరూపుడు. అందుకే ఆయనను... పరంజ్యోతియే శరణమయ్యప్ప హోమప్రియనే శరణమయ్యప్ప కర్పూర జ్యోతియే శరణు మయ్యప్ప జ్యోతి స్వరూపనే శరణు మయ్యప్ప మకర జ్యోతియే శరణమయ్యప్ప అని వేడుతాం.. కీర్తిస్తాం..

➠ దేశమంతా జరుపుకునే జనవరి 16, కోనసీమ ప్రభల తీర్థం సంక్రాంతి కొబ్బరాకుల నడుమ కోనసీమకు కొత్త అందాలు తెచ్చిపెడుతుంది. సస్యలక్ష్మి ఇంటికి తరలివచ్చిన వేళ కనుమ పండుగ రోజున ముత్యాల ముగ్గుల నడుమ నుంచి కోనసీమ ప్రభల కోలాహలం ఆనందపరుస్తుంది. ఏకాదశ రుద్రుల సమావేశ ప్రతీకగా నిర్వహించే ప్రభల తీర్థం విశేషాలు.

➠ స్వామి వివేకానందుల జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. యుక్తవయస్సులోనే భారతీయ కీర్తిపతాకను ప్రపంచ వేదికపై రెపరెలాడించిన మహనీయుడు. యువజనులలో స్ఫూర్తి నింపితే వారే దేశానికి వెలుగునిస్తారని నమ్మిన మానవతావాది. నేటికీ యువతరం హృదయాలలో ఆయన వ్యక్తిత్వం మహోన్నతంగా ప్రకాశిస్తూనే ఉంది. వివేకానందుల జయంతి సందర్భంగా ఆయన సందేశం.

➠ ఈనేల నాలుగుచెరగులా రెండుసార్లు పాదయాత్ర చేసి ధర్మదీపాన్ని వెలిగించిన మహనీయులు కంచి పరమాచార్య. కంచి కామకోటి పీఠానికి 68వ జగద్గురువుగా పీఠాధిపత్యాన్ని స్వీకరించింది మొదలు ఎనిమిది దశాబ్దాల పాటు దక్షిణభారతాన్ని ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేశారు. నిండునూరేళ్లు ధర్మాచరణకు నిలువెత్తు నిదర్శనంగా మహోన్నత జీవితాన్ని 1894 మే 20వ తేదీన దక్షిణ తమిళనాడులోని విల్లుపురం గ్రామంలో కర్ణాటక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

Recent Comments