ప్రగతికి చైతన్యానికి సంకేతాలైన జగన్నాథస్వామి రథోత్సవం ఈ నెల 14వ తేదీన అత్యంత వైభవంగా జరగనుంది... అందరినీ చల్లగా చూసే పెద్దమ్మతల్లికి బోనమెత్తే శుభతరుణం ఈ ఆషాఢం... తెలంగాణ ఆడపడుచులు, తల్లులు అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు, పొలిమేరమ్మలకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈనెల 15వ తేదీ నుంచి నాలుగు వారాల పాటు ఆషాఢ జాతరలు వేడుకగా జరగనున్నాయి. మరోవైపు వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కళకళలాడే పర్వదినం తొలి ఏకాదశి జూలై 23న రానుంది. గురువులను ఆరాధించుకునే గురుపూర్ణిమా ఈనెల 27న వస్తోంది. ఇక దేశభక్తుడు, దార్శనికుడు స్వామి వివేకానందుని పుణ్యతిథి ఈ నెల 4వ తేదీన వస్తోంది... మన దేశ సంపద సౌభాగ్యం మన యువత... భారతదేశం శైశవం నాటి ఊయల, యవ్వన బృందావనం, వార్థక్యం నాటి పుణ్యలోకం. మన యువత ఆరోగ్యవంతులై నిత్యోత్సాహులై ఉండాలి. తాత్త్విక చింతనల కంటే శరీరదార్ఢ్యతపై దృష్టిపెట్టాలి... ఇలాంటి నవసందేశాలను అందించిన ఆధునిక యోగి పుంగవుడు వివేకానందుడిని స్మరించుకుందాం.

➠ ఆషాఢం వచ్చిందంటే చాలు... తెలంగాణలోని పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా బోనం ఎత్తుతుంది... ఆషాఢ మాసంలో బోనాల పండుగకు తెలంగాణ తంగేడు పువ్వులా పరిమిళిస్తుంది... బోనాలకు సంబంధించి మరిన్ని విశేషాలను రాంపల్లి ప్రణీత్ శర్మ... ఆషాఢ జాతర'లో చూద్దాం...

➠ సమస్త విశ్వానికి అధిపతి జగన్నాథుడు... 44 అడుగుల ఎత్తున్న రథంలో సోదరీసోదర సమేతంగా జగన్నాథస్వామి రథయాత్ర కొనసాగుతుంది. 250 అడుగుల పొడువు... 8 అంగుళాల కైవారం ఉండే తాళ్లతో అశేష భక్తజనం రథాలను లాగడానికి పోటీ పడతారు... ఆషాఢమాసంలో ముందుకు కదిలే ఆ దేవదేవుడి రథచక్రాల గురించి సాయిశ్రీత్రేయ వివరణను 'జగన్నాథస్వామి... నయనపథగామి'లో తెలుసుకుందాం...

➠ ఆషాఢ మాసంలో వచ్చే వుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు... ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రకు ఉపక్రమిస్తారు... కార్తికంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు తిరిగి మేల్కొంటారంటున్న... ధర్మప్రియ... విశ్లేషణను 'మోక్షానికి సోపానం తొలి ఏకాదశి'లో చూద్దాం...

➠ గురువు స్థానం మహోన్నతమైనది... మనిషికే కాదు దైవానికి సైతం గురువే మార్గం చూపాలి. అందుకే దేవుడు, గురువు ఇద్దరూ ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా గురువుకే నమస్కరించమని పెద్దలు చెప్పారు... మరి గురువును పూజించుకునే విధానం... యల్లప్రగడ మల్లికార్జునరావు... 'గురుపూర్ణిమ'లో తెలుసుకుందాం.

➠ వీటితోపాటు గ్రామదేవతలు, భక్తపరాధీనుడు, సింగిరి పున్నమి, జయ పాండురంగ విఠలా!, కాలసర్పదోషం కొలువై ఉన్నాడే శ్రీరంగశాయి, ధర్మ సందేహాలు, మాసఫలం, పుస్తక సమాచారం కూడా ఉన్నాయి. ఇక గురుపూర్ణిమను పురస్కరించుకుని 'అందరి దైవం సాయి' చురు పుస్తకాన్ని కూడా మీరు అందుకోవచ్చు...

Recent Comments