ఈ తెలుగు సంవత్సరం షడ్రుచుల సమాహారంగా సాగాలని (మార్చి 29) అందిరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నమ్మినవారిన ఆపదలో ఆదుకునే దేవుడిగా లోకప్రసిద్ధుడైన నరసింహస్వామికి పురణాల్లో విశిష్ట స్థానం. దేశవ్యాప్తంగా అందులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆ స్వామి ఆలయాల్లో ఆ దేవుని కల్యాణాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఈ సంచికలో పంచ నారసింహ క్షేత్రాలను, నవ నారసింహుల ప్రసక్తిని సచిత్రంగా పొందుపర్చి మీ కోసం అందిస్తున్నాం. మార్చి 4న మంత్రాలయ రాఘవేంద్రుల జయంత్యోత్సవాలను భక్తి ప్రపత్తులతో జరుపుకుందాం. మార్చి 12న దేశమంతా జరుపుకునే రంగుల పండుగ హోలీ అందరిలో నూతన ఉత్సాహం నింపాలని కోరుకుందాం... 

➠ సృష్టి ఆరంభానికి బ్రహ్మ ఎంచుకున్న ముహూర్తం ఉగాది. సృష్టి ఆరంభానికి ముందు ఆయన కాల విభజన చేసిన తర్వాత ప్రాణిని పుట్టించాడు. అలా సృష్టి ప్రారంభమైనది ఉగాదే నాడే అంటూ ఉగాది విశిష్టతను కాకునూని సూర్యనారాయణమూర్తి 'వసంతంలో తొలివేకువ'లో చూద్దాం...

➠ భారతీయ సంస్కృతి రంగుల హరివిల్లు. కాలానికి అనుగుణంగా ఆనందార్ణవ శోభిత పర్వదినాలతో ఆ హరివిల్లు వెల్లివిరిస్తుంది. వసంత రుతువు అడుగిడే వేళ ప్రకృతి ఆహ్లదభరితమైన రసాకృతిని సంతరించుకుంది. హరిత వర్ణ శోభతో ముస్తాబవుతుంది.
మధుమాసవేళ వయోభేదాలు మరిచి వసంతాలాడతారు. డాక్టర్‌ కె.విద్వత్‌ శ్రీనిధి అందించిన హోలీ సంప్రదాయ విశేషాలు 'రంగుల కేళీ హోళీ'లో మీ కోసం...

➠ తెలంగాణ ప్రజల ఇష్టదైవం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడు. ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణం జరిపించుకుంటున్న వేళ ఆ స్వామి బాలాలయంతో పాటు జెడ్పీ హైస్కూల్‌ మైదానంలోనూ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఎన్‌. గీతారెడ్డి అందించిన శ్రీలక్ష్మీనరసింహుడు కళ్యాణోత్సవం విశేషాలను 'యాదాద్రీశాయ మంగళం'లో చూద్దాం...

➠ శ్రీరాఘవేంద్ర యతీంద్రుల ప్రహ్లాదుని అవతారమని భక్తుల విశ్వాసం. ద్వెత మతానికి విశ్వ విఖ్యాతి కలిగించిన గురుదేవుడు. ఆయన సన్నిధిలో ఫాల్గుణమాస గురుభక్తి ఉత్సవాలు జరగుతున్న వేళ ధర్మప్రియ మాటల్లో 'మంత్రాలయ ప్రభువు'...

➠ వీటితోపాటు పంచాంగం చూడాల్సిన విధానం వివరించిన 'ఇలాచూడాలి పంచాంగం', ఆరు రుచుల ఉగాది, విశిష్టం భక్తిటీవీ పంచాంగం, నృసింహుడు అవతరించిన అహోబిలం, శ్రీనృసింహ వైభవం, కోరుకొండరాయని కల్యాణం, కదిరీ నరసింహుడా!, మహాలక్ష్మీ నమోస్తుతే!, పరమహంస యోగానందతో పాటు... ధర్మ సందేహాలు, మాసఫలం, పుస్తక సమాచారం కూడా ఉన్నాయి ఈ సంచికలో...

Recent Comments