సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు పదిరోజులు నవదుర్గల అలంకారాలతో, ఆరాధనలతో, ఆరగింపులతో విలక్షణంగా సాగుతుంది. చెడుమీద మహాదుర్గ పోరు సాగించి ఆఖరికి విజయదుర్గగా జేజేలతో పూజలు అందుకుంటుంది. తిరుమలయ్య బ్రహ్మోత్సవాలలో విశిష్టమైన గరుడ వాహనసేవ 4న సప్తగిరులను అశేష భక్తజనంతో అలరించనుంది. తెలంగాణ ముత్తయిదువలు రంగుపూల గోపురాలతో ఆడిపాడి కొలిచే బంగారు బతుకమ్మ ఈనెల 6న స్వస్తి పలికించుకుంటుంది. అందరికీ శుభాలు కురిపిస్తుంది. ఈనెలలోనే ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం మహాద్భుతంగా జరగనుంది. విజయనగరం సిరిమానోత్సవం కోలాహలంగా జరిగే జన సందోహపు వేడుక. ఆడపడుచులు పుట్టిళ్లను సేవించి బంధుమిత్రులతో జరుపుకునే అపురూపమైన పల్లెపండగ అట్లతద్దె. ఇది ఈనెలలోనే ఉయ్యాలలెక్కి వస్తోంది. స్వాగతించండి. చీకట్ల పోకార్చి వెలుగులు నింపే దివ్యదీపావళి (27వ తేదీ) బాణసంచా సందళ్లతో రానుంది. శ్రీచినజీయర్ స్వామి తిరునక్షత్రం పండగలో పండగ. అన్ని పండగలతో ఆశ్వయుజం వెళ్లి మహాదేవునికి ప్రీతిపాత్రమైన కార్తికం ఆకాశదీపమై, చిరుచలియై, విబూది రేఖగా లేత మారేడుదళంగా ప్రవేశిస్తోంది. హరిహరులు సమస్త సృష్టినీ దయతో రక్షించెదరు గాక! దసరా, దీపావళి పండగలపై ధర్మసందేహాల వివరణలతో చిరుపుస్తకం అందుకోండి.

➠ విజయదశమి పర్వదినాన సాయి పుణ్యతిథిని షిర్డీలో వైభవోపేతంగా నిర్వహిస్తారు. నాలుగురోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. దేశవిదేశాల నుంచి లక్షలాది భక్తులు షిర్డీని సందర్శిస్తారు. విరోధాలు, విభేదాలు, వైషమ్యాలు లేని సమాజస్థాపనే సాయి ఆకాంక్ష. ఆ సద్గురువు చూపిన బాటలో నడవడమే అసలైన సాయి ఆరాధన.

➠ నాగుల చవితినాడు పుట్టకు పూజచేస్తారు. పుట్టమన్ను పవిత్రం. సారవంతం. కుమారస్వామిని సర్పరూపంలో పూజిస్తాం. కార్తికమాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఆ సమయంలో నాగారాధన వల్ల కామాన్ని, మృత్యువును జయించే సిద్ధి కలుగుతుంది. అందుకే కార్తికమాసమంతా నాగారాధన ప్రత్యేకంగా చేస్తారు. 

➠ విజయనగరం సిరిమానోత్సవం అతిపెద్ద వేడుక. రెండున్నర శతాబ్దాలకు పైబడి నిరంతరాయంగా సిరిమానోత్సవం జరుగుతోంది. ఏటికేడాది పైడితల్లిని దర్శించవచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. సిరిమాను ఉత్సవంలో అమ్మవారిని దర్శించిన వారికి కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం.

➠ ఉత్సవం అంటే గొప్ప యజ్ఞం అని అర్థం. దేవాలయంలో చేసే ఉత్సవమనే యజ్ఞం దేశశాంతికి, క్షేమానికి దోహదపడుతుంది. ఈ ఉత్సవ సేవలవల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు పుష్కలంగా లభిస్తాయి. ప్రపంచమంతా సుఖంగా ఉంటుందని వైఖానస  ఆగమం చెబుతోంది. అటువంటి మహోన్నత ఆదర్శం గల ద్వారకాతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 8న ప్రారంభమవుతున్న నేపథ్యంలో...

➠ సత్యజ్ఞానాలకు సంకేతం పరబ్రహ్మ స్వరూపం. దానికి లక్ష్యభూతుడు శ్రీరాముడు. తన ధర్మ, న్యాయ ప్రవర్తనతో రాముడు పురుషోత్తముడై ప్రకాశించాడు. రామకథను గానం చేసి వాల్మీకి మహర్షి లోకాన్ని ఉద్ధరించాడు. ఆశ్వయుజ పౌర్ణమి వాల్మీకి జయంతి సందర్భంగా...

➠ కోటి దీపాల పండుగకు అందరికీ స్వాగతం... ఇలకైలాసంలో జరిగే వేడుకకు సుమస్వాగతం... ముక్కోటి దేవతలు దీపాలై మెరిసే ఉత్సవం.... ఇలపై కైలాసాన్ని దర్శింపచేసే ఉత్సవం. మహాదేవునికి జరిగే మహాభిషేకం. సకలదేవతలకు కల్యాణోత్సవం. భక్తకోటి తరలివచ్చే జననీరాజనోత్సవం. ప్రణవనాదోత్సవం. భక్తిటీవీ కోటిదీపోత్సవం.

Recent Comments