NOTE : ఇది కేవలం ఆన్‌లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.
మహాదేవుని దయ పుష్కలంగా లభించింది. మహనీయుల దివ్యాశీస్సుల బలం దానికి తోడైంది. 2012లో మేము సంకల్పించిన నాటినుంచి నేటివరకు భక్తిటీవీ కోటిదీపోత్సవం అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. 14 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. వెన్నెలకు పరిమళం అబ్బినట్లుగా పీఠాధిపతుల, మఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, పెద్దల ప్రవచనాలు, ముఖ్య అతిథుల ప్రసంగాలు, అనేక భక్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తిటీవీ కోటిదీపోత్సవంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం హైదరాబాద్, ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 1 నుంచి 13 వరకు దేదీప్యమానంగా నిర్వహించుకున్నాం. ముఖ్యంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి శ్రీగజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, 'కోటిదీపోత్సవం కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితమవకుండా, భారతదేశం మొత్తం గర్వపడే జాతీయ పండుగగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలవాల'ని పేర్కొనడం మాలో కోటిరెట్లు బలాన్ని నింపింది.
కోటిదీపోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం తగిన ప్రతిపాదనలు వెంటనే పంపిస్తే, కేంద్రం తరఫున గుర్తింపుకు అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపడతామని తెలిపారు. ఇందుకు అనుగుణంగా భక్తిటీవీ కోటిదీపోత్సవంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, 'ఈ ఉత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామ'ని పేర్కొన్నారు. 'ఇకపై దీనిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని, వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామ'ని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఈ స్థాయిలో గుర్తింపు లభించడంతో మా శ్రమ పరిపూర్ణంగా ఫలించినట్లయింది. ఈ విజయానికి కారణమైన అశేష భక్తజనావళికి కృతజ్ఞతలు. కోటిదీపోత్సవ సంకల్పం వర్ధిల్లాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.
➠ వైకుంఠ ఏకాదశి పర్వదినాన విష్ణుఆలయాలన్నీ కిటకిటలాడతాయి. తెల్లవారుజామునుంచే ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారదర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని, ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వ వైశిష్ఠ్యం.
➠ మనమైతే దీపావళి ఒక్కసారి జరుపుకుంటాం కానీ.. అరుణాచలంలో రెండుసార్లు జరుగుతుంది. ఆశ్వియుజ అమావాస్య రోజున దీపావళి జరుపుకున్న స్థానికులు మళ్లీ మహాదీపం రోజున కూడా ఇల్లంతా దీపాలు వెలిగించుకుంటారు. కొండపై దీపం వెలిగే సమయానికి తమ ఇంటి డాబాలపై కూడా ప్రత్యేకంగా దీపారాధన చేసుకుంటారు.
➠ మనమైతే దీపావళి ఒక్కసారి జరుపుకుంటాం కానీ.. అరుణాచలంలో రెండుసార్లు జరుగుతుంది. ఆశ్వియుజ అమావాస్య రోజున దీపావళి జరుపుకున్న స్థానికులు మళ్లీ మహాదీపం రోజున కూడా ఇల్లంతా దీపాలు వెలిగించుకుంటారు. కొండపై దీపం వెలిగే సమయానికి తమ ఇంటి డాబాలపై కూడా ప్రత్యేకంగా దీపారాధన చేసుకుంటారు.
➠ ధనుర్మాసం వచ్చిందనగానే తెలుగునాట వెలుగుల సందడి ప్రారంభమవుతుంది. తెల్లవారు జామున ఇళ్ల ముంగిళ్లలో కళాపి చల్లి ముగులు పెట్టి ఆ రంగవల్లుల మధ్యన ఆవుపేడతో చేసిన గొబ్బెమమ్మలనుపెట్టి గొబ్బి పాటలను పాడటం తరతరాల సంప్రదాయంగా వస్తోంది. ఈ పండుగ వెనుక సంప్రదాయంతో పాటు సామాజిక ప్రయోజనాలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి.
➠ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబరు 1 నుంచి 13 వరకు జరిగిన కోటి దీపాల కుంభమేళా ఆధ్యాత్మిక చరిత్రలో మరో అధ్యాయాన్ని లిఖించింది. సాయంసంధ్యవేళ మంగళధ్వనులతో కార్యక్రమ ప్రారంభం నుంచి.. మహామంగళహారతితో ముగింపు వరకు ప్రతీక్షణం శివమయమే. ప్రతీ ఘట్టం శివ సాక్షాత్కారమే. ప్రతీ అణువులో శివ దర్శనమే.