వచ్చెవచ్చె బోనాలు! అమ్మతల్లులు తెచ్చెతెచ్చె బోనాలు!!
బిడ్డపాపల రక్షించే అమ్మతల్లి జగదంబికా నీకు బోనాలు!
సర్వజీవుల చల్లంగ చూసే ఉజ్జయిని మహంకాళికి కోటి దండాలు!
లాల్ దర్వాజా మూలపుటమ్మకి భక్తిమీరగా బోనాలు!

ఆషాఢమాసం ప్రవేశంతో జూన్ నెలలో తెలంగాణ బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వరకు ప్రతి గురువారం, ఆదివారం వివిధచోట్ల అమ్మతల్లులకు బోనాలు సమర్పిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జూలై 13న, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జూలై 20న జరగనున్నాయి. అమ్మా బైలెల్లినాదో... అంటూ సాగే ఆడపడుచుల బోనాల సమర్పణోత్సవం తెలంగాణ ప్రజల భక్తితత్పరతకు అద్దం పడుతుంది. ప్రతి ఆషాఢంలో వచ్చి... బోనం స్వీకరించి మనల్ని చల్లంగా దీవించే అమ్మతల్లులందరికీ వందనాలు. ఆషాఢ శుక్ల ఏకాదశిని (జూలై 6) తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఆనాడు పాలకడలిపై శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ నేపధ్యంలోనే దక్షిణాయన పుణ్యకాలం జూలై 16న ప్రారంభమవుతుంది. పితృదేవతల ఆరాధనకు శ్రేష్ఠమని పెద్దలు చెప్పే ఈ దక్షిణాయనంలో దేవీదేవతలందరూ మన పుణ్యాలను చక్కగా పండించాలని కోరుకుందాం.

గురుఃసాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. గురువులందరినీ పూజించుకునే గురుపూర్ణిమ పర్వదినం జూలై 10న వస్తోంది. మానవజాతిని సంస్కరించి, ముందుండి నడిపించిన సద్గురువుల బోధనలను స్మరించుకునేందుకు తగిన తరుణం గురుపూర్ణిమ. ఈ నిండు పూర్ణిమనాడు పీఠాధిపతులు, ఇతర స్వాములు చాతుర్మాస్య దీక్షలు చేపడుతుంటారు. ఏడాదిపొడవునా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ... ధర్మప్రచారంలో తీరికలేకుండా గడిపే సాధుసంతులంతా ఈ నాలుగునెలల కాలంపాటు ఏదో ఒక ప్రాంతంలో మాత్రమే ఉంటూ శిష్యులను అనుగ్రహిస్తుంటారు. అందరికీ అందుబాటులో ఉంటూ సత్సంగాలను నిర్వహిస్తుంటారు. అటువంటి గురువులందరికీ వందన సహస్రాలు సమర్పించుకుందాం. భక్తిపత్రిక ప్రారంభించి ఈ మాసంతో పదేళ్లు పూర్తయి పదకొండో సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఇన్నేళ్లుగా మ

➠ ప్రత్యక్ష భగవానుడు సూర్యదేవుడి పుత్రిక... సృష్టికార్యంతో అలసిన బ్రహ్మదేవునికే ఉపశమనాన్ని కలిగించినది... త్రిలోక సంచారి అయిన నారద మహర్షి శాపాన్ని పోగొట్టినది... కేవలం స్మరించినంతనే పాపాలను హరింపజేసే పుణ్యదాయిని.. తపతీ నది! గంగాస్నానం, తుంగాపానం, నర్మద దర్శనం, తపతీ స్మరణం జన్మసాఫల్యాన్నిస్తాయి.

➠ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మకర సంక్రాంతి తెలుగువారికి పెద్దపండుగ. సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించే దక్షిణాయనం కూడా పుణ్యప్రదమైనదే. మన ప్రధాన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. శుభకార్యాలను ఉత్తరాయణంలోనే నిర్వహించే మనం శక్త్యారాధన, రుద్రారాధన, పితృదేవతారాధన మాత్రం దక్షిణాయనంలోనే చేస్తాం.

➠ ఆషాఢ పూర్ణిమను సింహాచలంలో గిరిపున్నమి అని వ్యవహరిస్తారు. అక్షయ తృతీయ నుంచి నాలుగు విడతలుగా చందన సేవను స్వీకరించిన సింహాద్రి అప్పన్న గిరిపున్నమి నాటికి సంపూర్ణ రూపాన్ని ధరిస్తాడు. పున్నమికి ముందురోజు సాయంకాలం నుంచి 32 కిలోమీటర్ల దూరం కాలినడకన సింహాచల గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వేలాది భక్తులు పున్నమినాడు స్వామి దర్శనం చేసుకుంటారు.

➠ జ్ఞానస్వరూపుడు, త్రిగుణాతీతుడైన సద్గురువు అనుగ్రహం అందరికీ కావాలి. గురు శబ్దంలోని 'గు' గుణాతీతం, 'రు' రూపాతీతం. అంటే గురువు నిర్గుణ పరబ్రహ్మతో సమానుడు. త్రిమూర్తులకన్న అతీతుడు గురువు అని ఉపనిషత్కథనం. గురుపాదం పూజకు కారణం. గురువాక్యం మంత్రానికి ఆద్యం. గురుకృపయే మోక్షం.

➠ ప్రకృతిలోని ప్రతి అణువూ జగన్మాత స్వరూపమే. అందుకే ఆమెను ప్రకృతి స్వరూపిణిగా శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. తన బిడ్డల వంటి భక్తుల క్షుద్బాధను తీర్చటానికి ఆ తల్లి తానే స్వయంగా అన్నిరకాల కూరగాయలను ఆభరణాలుగా ధరించి, శతాక్షిగా అవతరించింది. ప్రజలందరికీ సాంత్వన చేకూర్చింది. అందుకే ఆ తల్లి శాకంభరిగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.

➠ కేవలం రెండున్నర అడుగుల ఎత్తుతో ఎడమ చేతితో కవ్వం, కుడిచేతిలో కవ్వపు తాడు ధరించి కనిపించే నవనీత చోరుడు ఉడుపి శ్రీకృష్ణుడు. ద్వాపరయుగంలో రుక్మిణీదేవి పూజించిన విగ్రహం కలియుగంలో మధ్వాచార్యుల పవిత్ర హస్తాల మీదుగా ఉడుపిలో ప్రతిష్ఠితమైంది. ఉడుపి శ్రీకృష్ణమఠంలో తొలి ఏకాదశికి ముందురోజు మహాభిషేకం జరుగుతుంది.

Recent Comments