భక్తి పత్రిక ఏప్రిల్ 2017

Availability : In Stock

లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్...
కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే....

ఆరాధ్యదైవమై ఇంటింటా కొలువుదీరిన శ్రీరామచంద్రుని కల్యాణ సమయమిది... చైత్ర శుద్ధ నవమి ఏప్రిల్ 6న అభిజిత్ ముహూర్తంలో వాడవాడలా శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా సాగనుంది. సీతారాముల తలల మీద నుంచి జాలువారిన ముత్యాలతలంబ్రాలు అందరికీ శుభాలు చేకూరుస్తాయని భక్తుల నమ్మకం... సీతారాముల కల్యాణం పూర్తయితే కానీ... పెళ్లిల్లు ఆరంభం కావు... సీతారాములు హిందూ వివాహవ్యవస్థకు ప్రతీకలు.

ఈ మధుమాసోదయ మంగళవేళ ఏప్రిల్ 7న సింహాద్రి అప్పన్న... అదే రోజు అరసవల్లి సూర్యనారాయణమూర్తి పెళ్లికి సిద్ధమవుతున్నారు. మధురై మీనాక్షి తల్లి, బెజవాడ కనకదుర్గమ్మ కల్యాణ తిలకం దిద్దుకోనున్న దివ్యవిశేషం కూడా ఇప్పుడే రావడం మహాభాగ్యం... ఆ దేవుళ్లంతా పెళ్లిపీటల నుంచి అందరినీ దీవించాలని ప్రార్థిద్దాం...

ఇక ఈ తరుణంలోనే ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి కల్యాణం, వేములవాడ శివపార్వతుల కల్యాణం జరగనున్నాయి. ఏప్రిల్ 7 వాడపల్లి వెంకన్నతీర్థం మరోవైభవం కాగా... 28న సింహాచలం అప్పన్న చందనసేవ తర్వాత నిజరూప దర్శనం ఇవ్వనున్నారు... ఆ స్వామి అందరినీ కాపాడాలని మొక్కుకుందాం...
₨ 51.00
Not Rated Yet