భక్తి పత్రిక డిసెంబర్ 2017

Availability : In Stock

మహాదేవుని కరుణా కటాక్ష వీక్షణాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో దేదీప్యమానంగా భక్తిపారవశ్యాన్ని నింపిన భక్తిటివి కోటి దీపోత్సవం దిగ్విజయంగా ముగిసింది. ఎందరో మహనీయుల దివ్యాశీస్సులతో రెండు తెలుగు నగరాల్లో దీపోత్సవం సరికొత్త చరిత్ర సృష్టించింది. 23రోజుల పాటు సాగిన ఈ దీపయజ్ఞం అణువణువునా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించింది. లక్షలాది మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచింది. ఇంటింటా పవిత్ర దీపాలు వెలిగాయి. అవి అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన జ్యోతులయ్యాయి. దీపం పరబ్రహ్మ స్వరూపంగా బాసిల్లాలనే మా సంకల్పం సఫలమైంది. ఇంకా రాబోయే కార్తిక మాసాలను కూడా ఇదే స్ఫూర్తితో, భక్తి శ్రద్ధలతో కాంతిమయం చేయాలన్నదే మా ఆకాంక్ష.

ఈ మాసం ఆరంభంలో హనుమద్ర్వతం, దత్తాత్రేయ జయంతి,అన్నపూర్ణా జయంతి, తిరువణ్ణామలై కార్తిగై దీపం రావడం విశేషంగా చెప్పవచ్చు. డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం ఆరంభమౌతుంది. రాబోయే సంక్రాంతికి నాంది పలుకుతూ నేలతల్లిని అలంకరించే సందడి మొదలౌతుంది. రంగవల్లులు, గొబ్బిళ్లు కనుల విందు చేసే సంక్రాంతి నెల కళాత్మకంగా సాగుతుంది. డిసెంబర్ 17న కొమరవెల్లి మల్లన్న కల్యాణం భక్తకోటికి దివ్య విశేషం. ఇంకా మహాను భావుడు శ్రీరమణ మహర్షి అవతరించిన రోజు డిసెంబర్ 30. పూర్ణయోగి అరవిందుని మహాసమాధి కూడా ఈ నెల 5 వతేదీనే.
₨ 51.00
Not Rated Yet