భక్తి పత్రిక జనవరి 2018

Availability : In Stock

ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశిస్తూ.. తెలుగు లోగిళ్లకు సంక్రాంతి శోభలందిస్తున్నాడు. ఉత్తరాయణ పూర్వకాలం ఆరంభమౌతుంది. పండుగ సంబరాలతో పాటు పితృ దేవతలను ఆరాధించుకునే పర్వం కూడా ఇదే కావడం విశేషం. నూతన సంవత్సరారంభ భక్తి సంచికతోపాటు 2018రాశిఫలాలను అనుబంధంగా అందిస్తుంది ఈ సంచిక.

కొత్త ధాన్యాలతో పాలపొంగళ్లతో, రంగవల్లులతో వాకిళ్లు కళకళలాడుతుంటాయి. అలాగే అక్రమపాలనపై తిరగబడి ఆత్మబలిదానం చేసుకున్న ధీరవనితలు సమ్మక్క, సారక్కల మేడారం జాతర జనవరి31న అత్యంత ప్రభావవంతంగా జరగనుంది. అలాగే భారతీయ తత్త్వ చింతనకు స్వర్ణగోపురమైన స్వామి వివేకానంద జన్మదినం జనవరి 12 సంక్రాంతి పర్వదినానికి నాంది. ఇంకా శబరిమల పవిత్ర మకరజ్యోతి జనవరి 14న సాక్షాత్కరించనుంది. భారతీయులంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనే జాతీయ పండుగ జనవరి 26.
₨ 51.00
Not Rated Yet