భక్తి పత్రిక ఫిబ్రవరి 2018

Availability : In Stock

శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి

శివరాత్రి మహాపర్వం ఫిబ్రవరి 13న వస్తుంది. దేశంలోని శివక్షేత్రాలన్నీ శివనామంతో మార్మోగుతుంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ శివాలయాల్లో మాత్రమే కాదు మారుమూల గుళ్లలో కూడా అభిషేకాలు విశేష పూజలు జరుగుతాయి. శ్రీశైల మల్లన్న, శ్రీకాళహస్తీశ్వరుడు బ్రహ్మోత్సవాలు జరిపించుకుంటున్న వేళ అందరికీ శుభాలివ్వాలని కోరుకుందాం.

ఈ మాసంలో శివరాత్రితో పాటు పిలిస్తే పలికే దేవుడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి జయంతి ఈ నెల 22న భక్తులకు పండుగ తెస్తుంది. పన్నెండేళ్లకోసారి వచ్చే శ్రావణ బెళగొళ (కర్ణాటక) శ్రీ గోమఠేశ్వర మహామస్తకాభిషేకం ఉంది. ఈ నెల ల17 నుంచి తొమ్మిది రోజులపాటు జరిగే ఈ పుణ్య అభిషేకోత్సవానికి లక్షలాది భక్తజనం తరలివచ్చి తరిస్తుంది. అలాగే శ్రీనివాస మంగాపురం (5నుంచి 14వరకు), తరిగొండ లక్ష్మీనృసింహ 22 నుంచి మార్చి3 వరకు బ్రహ్మోత్సవాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి.
₨ 51.00
Not Rated Yet