జూన్ 2018 ఆన్‌లైన్ ఎడిషన్

 

 

నిత్యకృత్యంలో చేసే పనుల్లో సైతం నైపుణ్యాన్ని పెంచుకోవడమే

యోగం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మీ అందరి

ఆదరాభిమానాలతో విజయవంతంగా మూడు సంవత్సరాలు

పూర్తి చేసుకుంది భక్తి పత్రిక. ఈ సందర్భంగా శ్రీ త్రిదండి

శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి దండాలు,

త్రికరణాలు అనే అంశంపై సాకల్యంగా అనుగ్రహించిన అనుగ్రహ

భాషణాన్ని పాఠకులకు సమర్పిస్తున్నాం. త్రిగుణాల నుండి

త్రివర్ణ పతాకం దాకా త్రిదళంగా, గుచ్ఛంగా వచ్చే

విశేషాలను ప్రత్యేక వ్యాస పరంపరలో అందిస్తున్నాం.

 

శ్రీశంకరుల వారి సౌందర్యలహరి ఆవిర్భవించిన

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ఈనెల 24న వస్తోంది. అలాగే..

పూరి జగన్నాథస్వామి స్నానోత్సవం జూన్ 28న రాబోయే

రథోత్సవానికి నాంది పలుకుతోంది. నవధాన్యాలను

పండించే అన్నదాతలు కాడి బుజాన వేసుకొనే తరుణం

ఏరువాక పున్నమి ఈనెల 28న వస్తోంది. కార్తెలన్నీ

కనికరించి.. వరుణుడి అనుగ్రహంతో తెలుగు నేలలు

బంగారు పంటలు పండాలని కాంక్షిస్తున్నాం.

కర్షకలోకానికి శుభాకాంక్షలు పలుకుతున్నాం...

 

జూన్ 2018 భక్తి పత్రిక గురించి మరింత తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి....

oil
santoor

Other Magazines