Email

Bhakthi Patrika Oct16

Availability : In Stock

''దుర్గా దర్గార్తిశమనీ దుర్గాపన్నివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గా సాధనీ దుర్గనాశినీ''
శరన్నవరాత్రుల్లో జగన్మాత అశేష భక్తజనావని పూజలందుకుంటుంది.

దివ్వెల పండగ దీపావళి మనలోని చీకట్లను తొలగించే చైతన్యరవళి..

పచ్చటి ప్రకృతి సాక్షిగా తెలంగాణ నేలను పూల పరిమళాలతో పులకించేలా చేస్తుంది బతుకమ్మ పండగ. విజయనగరంలో కొలువైన పైడితల్లి సిరిమానోత్సవం కనుల వైభోగమే.

ఇవన్నీ ఈ మాసంలో అరుదెంచిన అరుదైన ఆధ్యాత్మిక వైభోగాలు...
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

-ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే మూడు శక్తుల ముచ్చటను బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ వ్యాసం వివరిస్తుంది.

- మూలా నక్షత్రవేళ మాత్రమే సరస్వతిదేవికి ప్రత్యేక పూజలు ఎందుకు చేయాలి? పుస్తకం తెరిచిన వెంటనే పోతన విరచిత -తల్లీ నిన్ను దలంచి అన్న పద్యం చదవడం సర్వసాధారణం. మరి అలాంటి పద్యం విశేషం ఏంటి? ఇలాంటివి ఎన్నింటినో స్పృశిస్తుంది డాక్టర్ వై. మల్లికార్జునరావు 'వాగ్దేవీ నమోస్తుతే!'

-దేశవిదేశాల్లో కొలువైన శక్తిపీఠాలను వివరించే విశిష్ట వ్యాసం 'అష్టాదశ శక్తిపీఠాలు'. ఒక్కో పీఠం ప్రత్యేకలతోపాటు ఆయాక్షేత్రాలకు ఎలా  వెళ్లాలన్న సమాచారం కూడా ఇందులో ఉంది.

-యమత్రయోదశి లేదా ధనత్రయోదశి . పేరు ఏదైనా..ఆయుష్షు, ఐశ్వర్యం పెంపొందించేది ధనత్రయోదశి. దాని ప్రాశస్త్యం చెప్పనలవికానిది.

-సమతా, మమతలు మూర్తీభవించిన ఆధ్యాత్మిక సాధుమూర్తి చినజీయర్ స్వామి. దివ్యకళతో అలరారే విశిష్టాద్వైత ప్రవర్ధనా చక్రవర్తి షష్టిపూర్తి సందర్భంగా ప్రత్యేక వ్యాసం- కరుణామూర్తి.

-శ్రీమాతే లగాయితూ లలితాంబికా వరకు గల వేయి పేర్లలో అమ్మవారిని ఏ నామంతో పిలిచినా కరుణించి కటాక్షం చూపిస్తుంది  ఆ చల్లనితల్లి. అపమృత్యు దోష నివారణకు, దీర్ఘాయుష్షుకు, సకల సంపదల ప్రాప్తికి శ్రీలలితా సహస్ర నామ స్తోత్రం మార్గం చూపుతుంది. హయగ్రీవ బోధిత శ్రీలలితా సహస్ర నామావళితో కూడిన అనుబంధం ఈ సంచికకు అదనపు ఆకర్షణ...

-వీటితోపాటు ధర్మసందేహాలు, మాసఫలం, ఆధ్యాత్మిక పుస్తక సమీక్ష లాంటివి మరెన్నో మీకు ఆధ్మాత్మిక శక్తిని ప్రసాదిస్తాయి.

Reviews

There are yet no reviews for this product.