Email

భక్తి పత్రిక అక్టోబర్ 2017

Availability : In Stock

చీకటిని పారద్రోలి భువనమంతా వెలుగులు విరజిమ్మే దీపావళి ఈ నెల 19న వేడుక చేయనుంది... ఈ దివ్య దీపావళి అందరికీ శాంతిని, కాంతిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాం. తూర్పు దిక్కుకు పెద్ద పండుగైన సిరిమానోత్సవం ఈ నెల 3వ తేదీన ఘనంగా జరగనుంది... పైడితల్లి అందరినీ చల్లగా చూడాలని వేడుకుందాం. తెలుగు పల్లెలు ఆడపడచుల రాకతో కళకళలాడే అట్లతద్ది ఈ నెల 8న సందడి చేయనుంది.

పవిత్ర కార్తీకం ఈ నెల 20న ఆకాశ దీపాలతో అడుగుపెడుతోంది... విబూది రేఖలు, మారేడుదళాలు, మహాదేవుని నామస్మరణలు, కార్తీక ఉపవాసదీక్షలతో ఈ మాసం దివ్యప్రభలతో సాగుతుంది. కార్తీకంలో మూడు పొద్దులూ పవిత్రం, మూడు ఆకుల మారేడుదళం సాక్ష్యం, శివనామం పవిత్రం, కార్తీకంలో దీపం పుణ్యప్రదం... ఉపవాసం మోక్షప్రదం... శివనామం కైవలస్యకారకం... ముక్తికి సోపానం. కార్తికం భక్తి టీవీకి ప్రత్యేకం, మణిపూస... యేటేటా జరిపే కోటి దీపోత్సవాన్ని ఈ పొద్దు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్వహించ సంకల్పించింది... మహనీయులు, మఠాధిపతులు, మాతాజీలు విచ్చేసి దీపోత్సవానికి దివ్యత చేకూర్చనున్నారు. ఈ దీపయజ్ఞంలో విరివిగా పాల్గొని సదాశివుని సేవించుకోవాలని కోరుకుంటున్నాం...
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

-చారిత్రక సందర్భాలు ఎన్నో దీపావళి ప్రాభవానికి ఆధారాలుగా ఉన్నాయి... రావణాసురుణ్ని సంహరించిన

శ్రీరామచంద్రమూర్తి తిరిగి అయెధ్యకు వచ్చి భరతుణ్ని కలుసుకున్న రోజు దీపావళి. రాక్షసరాజైన బలి చక్రవర్తిని

వామనుడు పాతాళానికి పంపించింది కూడా దీపావళి రోజునే. ఈరోజు నుంచే విక్రమార్కశకం

ప్రారంభమైందంటున్న కప్పగంతు రామకృష్ణ వివరణను 'ఆనంద తారావళి'లో చూద్దాం...

-తమ చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే మిగిలేది అశాంతి, చికాకే, అదే ఒక దీపాన్ని

వెలిగించే ప్రయత్నం చేస్తే ఆ దీపమే మరికొన్ని దీపాలు వెలిగిస్తుంది... దీపం అంటే జ్ఞాన స్వరూపం...

అవి ఉన్న చోట చీకటి ఉండదు... అజ్ఞానానికి తావుండదు. అందుకే చీకటిపై వెలుగు సాధించిన విజయానికి

సంకేతమే దీపావళి అంటున్న దుగ్గిరాల గోపాలకృష్ణ మూర్తి మాటలను 'వెలిగించు దీపం'లో చదువుకుందాం....

-విజయనగరంలో భక్తులకు కొంగు బంగారమై భాసిల్లుతోంది పైడిమాంబ... విజయదశమి తరువాత

వచ్చే మంగళవారం నాడు పైడితల్లికి సిరిమానోత్సవం జరుగుతుంది.. ఈ ఉత్సవానికి ఏపీతో పాటు

ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు... సిరిమానోత్సవం విశిష్టత గురించి మంగిపూడి

కామేశ్వరరావు ఏం చెప్పారో తెలుసుకోవడానికి 'సిరులిచ్చే సిరిమాను'లో చూద్దాం....

-శివతత్త్వమంటే సుఖమనే లక్షాణానికి ఉన్న భావం... పరమేశ్వరుడి తత్త్వం సుఖ స్వరూపం...

నిజానికి అంతా ఆనందంలో పుట్టి, ఆనందంలోనే ఉంటూ, చివరకి ఆనందంలోనే లీనమైపోతాం...

మనమంతా ఆనందంలోనే ఉంటున్నామా అనేది గడ్డు ప్రశ్నే అంటూ మంజులూరి నరసింహరావు

ఏం చెప్పారో 'సాధనకుడే శివుడు'లో తెలుసుకుందాం...

-జీవితసారం జ్ఞానదీపంలా ప్రకాశించాలి... భౌతికమైన దీపం మానసికమైన దీపం కావాలి...

ఆ మానసిక దీపం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్మేలా గుండె గుడిలో వెలగాలంటున్న...

డాక్టర్ గరికిపాటి నరసింహారావు వివరణను 'జ్ఞానదీపం'లో చూద్దాం...

-లక్ష దీపాలతో 2012లో ప్రారంభమై... కోటిదీపాల కాంతులతో 2013 నుంచి ఆధ్యాత్మిక జగత్తులో

మహోద్యమంలా కొనసాగుతున్న భక్తిటీవీ కోటిదీపోత్సవం ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనుంది...

అక్టోబర్ 22 నుంచి నవంబర్ 5వరకు హైదరాబాద్‌ వేదికగా...

నవంబర్ 6 నుంచి 13వ తేదీవరకు విజయవాడ వేదికగా ఈ మహాదీపయజ్ఞం జరగనుంది....

దివి నుంచి చూసే దేవతలే అబ్బురపడే ఉత్సవం గురించి 'కోటి దీపాల కైలాసం'లో చూద్దాం...

-వీటితోపాటు లక్ష్మీప్రదాత, సిరులిచ్చుగాక, వివాయ విష్ణురూపాయ, కార్తికదీప వైభవం,

నడయాడే దేవుడు... ధర్మ సందేహాలు, మాసఫలాలు కూడా ఉన్నాయి...

ఇక ఈ సంచికతో పాటు 'కార్తిక మహత్యం' చిరుపుస్తకాన్ని కూడా అందిస్తున్నాం...

Reviews

There are yet no reviews for this product.