Email

భక్తి పత్రిక మార్చి 2018

Availability : In Stock

చాంద్రమానం అనుసరించే మనందరికీ సంవత్సరాది ఉగాది. మార్చి 18న కోయిల పాటలతో... షడ్రుచుల ప్రసాదంతో... పంచాంగ శుభశ్రవణంతో వచ్చేస్తుంది యుగాది. శ్రీవిళంబినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ శుభలాభాలు కలగాలని శుభాకాంక్షలు తెలుపుదాం. వసంతానికి ముందే పాళ్గుణ పూర్ణమ మార్చి1 రంగురంగుల హోలీ సంబరాన్ని తీసుకొస్తుంది. అలాగే శృంగారిమహాస్వామి జయంత్యుత్సవం ఈనెల 23న వస్తుంది. వారి జన్మోత్సవం జాతికి దినోత్సవం మంగళప్రదం కాగలదని ఆకాంక్షిస్తున్నాం.

అలాగే శ్రీసీతారామ కళ్యాణం తెలుగువారి మహోత్సవం, పచ్చని తాటాకు పందిళ్లు, వడపప్పు ప్రసాదాలు, చెరకు పానకాలు రామనవమి ఆనవాళ్లు. అటు భద్రాచలం, ఇటు ఒంటిమిట్ట 30న అంటు పగలు, ఇటు రాత్రి భక్తి శ్రద్ధలతో, మేళతాళాలతో, పెళ్లి వ్యాఖ్యానాలతో నూతన వధూవరులుగా సీతారాములు శిరస్సున ధరించిన ముత్యాల తలంబ్రాలు కమనీయ శోభతో వెలిగిపోతాయి.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

-శ్రీశృంగేరీ శారదా పీఠం భారతావనికి ఆధ్యాత్మిక దిక్సూచి. పరంపరగా శారదా పీఠాన్ని అధిరోహించిన జగద్గురువులందరూ అపర శంకరులై

ధర్మరక్షణ మహాయజ్ఞాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారు. స్వయంగా భారతీ తీర్థస్వామి వారి... అమృతవాక్కులు వివరణలో చూద్దాం.

 

- సృష్టి ఆరంభానికి బ్రహ్మ ఎంచుకున్న ముహూర్తం ఇది. సృష్టి ఆరంభానికి ముందు ఆయన ఉగాది నాడే కాల విభజన చేశాడు. యుగమంటే

రెండు అని అర్థం. కాలగణనలో రాత్రి పగలు అనే రెండు విభజలు ఏర్పడింది ఆరోజు. ఈ అంశాల కోసం చాగంటి కోటీశ్వరరావు శుభ ఉగాది వివరణ చూద్దాం.

 

- ఉగాది పండుగనాడు పంచాంగానికి దణ్ణం పెట్టి ప్రసాదం తీసుకొనే పద్ధతి మనది. ఈ సంస్కృతిలో అనేక ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి.

వీటి కోసం జా. జి.వి పూర్ణచందు 6 రుచుల ఉగాది వివరణలో చూద్దాం.

 

- ఆది శంకరులు ప్రతిష్టించిన దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం జగద్గురు స్థానం. ధర్మ సంస్థాపనే ధ్యేయంగా.. భారతావనికి మార్గనిర్దేశ

చేస్తున్న గురువులకు కార్యక్షేత్రం. ఈ వివరణ కోసం డా. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి 'శ్రీభారతీం భజే' వివరణ చూద్దాం.

 

- శ్రీరామ కర్ణామృతం స్తాత్రరాజం. రామనామ మహిమను వర్ణించే సుప్రసిద్ధ శ్లోకాలెన్నో ఈ స్తోత్రంలోనే ఉన్నాయి. శ్రీరాముని వ్యక్తిత్వాన్ని, రామాయణ

సందేశాన్ని విభిన్న కోణాల్లో అందించిన విశిష్టగ్రంధమిది. ఈ అంశాల కోసం జయ శ్రీరామ మంత్రంలో డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ వివరణ చూద్దాం.

 

- ఇంకా కనగ కనగ కమనీయం, రామాయణం పారాయణం, సీతాకల్యాణం, కదిలెను రామదండు, సాకేత సార్వభౌముడు వంటివి...

అదిగో భద్రాద్రి శంకర విజయేంద్రులు, దుర్గమ్మకు బ్రహ్మోత్సవం వంటి వ్యాసాలు చూడవచ్చు.

 

- అలాగే పరకాల మఠం, ధర్మసందేహాలు, మాసఫలం, షడ్రోపేతం వంటివి కూడా ఈ పుస్తకంలో చూడవచ్చు. దీంతో పాటు శ్రీవిళంబి నామ సంవత్సరంలో

పన్నెండు రాశుల వారికీ పంచాంగ ఫలితాలు ఎలా ఉన్నాయో పొందికగా సమకూర్చిన ఈ భక్తి పత్రికకు అనుబంధంగా అందుకోండి.

Reviews

There are yet no reviews for this product.