Email

భక్తి పత్రిక మే 2018

Availability : In Stock

నూతన ఆలయాల నిర్మాణం కంటే జీర్ణోద్ధరణ రెండురెట్లు అధిక పుణ్యఫలాలనిస్తుంది... యతీశ్వరులు, రాజగురువులు జీర్ణోద్ధరణకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు ఆధారాలు చెబుతున్నాయి. ఘనచరిత్ర, అద్భుత శిల్పకళా సంపదకు నెలవై, పురాణ ప్రశస్తి కలిగిన ఎన్నో ఆలయాలు ధూపదీపాలకు సైతం నోచుకోని దుస్థితిలో ఉన్నాయి. ఈ పరిస్థితి చక్కబడాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి... నిధుల దుర్వినియోగం అరికట్టాలి. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం కల్పించాలి... పౌరులందరికీ ఆలయ సంస్కృతి - చరిత్రపై అవగాహన పెంచే కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలి. ఆలయాల జీర్ణోద్ధరణను ఒక ఉద్యమంలా చేపట్టాలి.

చూచి రమ్మంటే కాల్చి వచ్చే దక్షత గల కార్యశీలి హనుమంతుడు... చిరంజీవిగా దివ్యకీర్తి పొందాడు... అంతటివాడు శ్రీరామదూతగా తనను పిలచే వారి పట్ల అపార కరుణ చూపిస్తాడు... దేశదేశాలన్నింటా హనుమజ్జయంతి ఉత్సవాలు మే 10న భక్తి ఉత్సహాలతో జరుపుకుంటున్నారు. ఆ మహా కార్యశూరుని నుంచి స్ఫూర్తి పొందుదాం... కర్తవ్యాలను పాటిద్దాం...
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

- కోరినవారికి కోరిన రూపాన దర్శనమిస్తాడు... తలచినవారికి తలపులతోని అభీష్టాలకు సిద్ధింపచేస్తాడు...

ఆర్తితో పిలిచేవారికి ఆపన్నహస్తం అందించే సులభసాధ్యుడైన దైవం ఆంజనేయస్వామి, భక్తుడు

భగవంతుడు ఒక్కటయ్యే మార్గానికి వారధి హనుమ అంటున్న డా. అన్నదానం చిదంబరశాస్త్రి

'అంతానీవే... హనుమంతా!'లో ఇంకా ఏం చెప్పారో చూద్దాం...

 

- సుందరకాండను పారాయణం చేస్తే కష్టాలు తీరుతాయనీ, తలపెట్టిన కార్యం ఫలప్రదమవుతుందని విశ్వాసం...

ఆరు కాండలుగా విభాజితమైన రామాయణంలో అయిదోది సుందరకాండ... హనుమంతుని భక్తులకు

సుందరకాండ విశేషమైనది... కోరికను బట్టి పద్ధతులను ఎంచుకుని సుందరకాండ పారాయణ చేయవచ్చు అని 'ఇహం పరం...

పారాయణం'లో అప్పాల శ్యామప్రణీత్ శర్మ చెప్పిన మాటలను తెలుసుకుందాం...

 

- విళంబి నామ సంవత్సరంలో జ్యేష్టమాసం అధికమాసంగా వచ్చింది... పురుషోత్తమమాసంగా పేరున్న అధికమాసంలో

చేసిన పుణ్యకార్యాలకు అధిక ఫలితాలు సిద్ధిస్తాయంటారు... మరి ఈ మాసం గురించి

'పురుషోత్తమ మాసం'లో డా. శంకరమంచి రామకృష్ణశాస్త్రి ఇచ్చిన వివరణ ఏంటో తెలుసుకుందాం...

 

- సుదర్శనక్రియాయోగంతో జీవనకళ నేర్పుతూ అందమైన జీవితాన్ని జీవించడం నేర్పుతున్న ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్...

ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మికతను ఆధునికతతో మేళవించి శాంతిమయ జీవనానికి మార్గనిర్దేశనం

చేస్తున్న రవిశంకర్ గారి జన్మదినం (మే 13వ) సందర్భంగా ప్రత్యేక వ్యాసం 'స్ఫూర్తి ప్రదాత'లో చూద్దాం...

 

వీటితో పాటు వాయునందనం భజే!, ఆంజనేయం మహాదేవం, శ్రీరామదూతం, మోదకొండమ్మ జాతర,

తిరుపతి గంగమ్మజాతర విశేషాలతో పాటుగా... ధర్మసందేహాలు, మానఫలం,

మహాతికి తోడుగా... 'ఇంటింటా ధర్మజ్యోతి' చిరుపుస్తకాన్ని ఈ సంచికతో అందుకోవచ్చు...

Reviews

There are yet no reviews for this product.